బూర్గంపహాడ్, ఏప్రిల్ 9 : తమ సమస్యల పరిష్కారం కోసం సారపాక ఐటీసీ ఎదుట కాంట్రాక్టు కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో కార్మికులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు గురువారం 15వ రోజుకు చేరాయి. బీఆర్ఎస్ నాయకులతో కలిసి దీక్షల వద్దకు చేరుకున్న మాజీ జడ్పీటీసీ కామిరెడ్డి శ్రీలత వారికి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కార్మికులు దీక్షలు చేపట్టినా యాజమాన్యం పట్టించుకోకపోవడం సరికాదన్నారు. యాజమాన్యం కార్మికులను చర్చలకు పిలిపించి సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని ఆమె కోరారు.
దీక్షలకు బీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు సానికొమ్ము శంకర్‌రెడ్డి, బీఆర్ఎస్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ జలగం జగదీష్, పట్టణ అధ్యక్షుడు కొనకంచి శ్రీను, యూత్ ప్రెసిడెంట్ సోము లక్ష్మీ చైతన్యరెడ్డి, కాంట్రాక్టు కార్మిక సంఘం అధ్యక్షుడు కుందూరు పెద్దిరెడ్డి, తాళ్లగొమ్మూరు సర్పంచ్ గుమ్మడి కృష్ణవేణి, బీఆర్ఎస్ నాయకులు చల్లకోటి పూర్ణ, వెంకటరమణ, చట్టు ఆంజనేయులు, సురేశ్, శ్రీను, యారం వెంకటరెడ్డి, యక్కంటి నరేశ్‌రెడ్డి మద్దతు పలికారు. శిబిరంలో కాంట్రాక్టు కార్మిక సంఘాల జేఏసీ కన్వీనర్ పాటి సోమిరెడ్డి, కో-కన్వీనర్లు సానికొమ్ము రామచంద్రారెడ్డి, బల్లెం నాగయ్య, ఎండీ యాకూబ్పాషాతోపాటు జేఏసీ సభ్యులు కూర్చున్నారు.