మధిర, మే 13 : వడదెబ్బతో భవన నిర్మాణ కార్మికుడు మృతిచెందాడు. ఈ ఘటన ఖమ్మం జిల్లా మధిర మండలంలోని నిదానపురం గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. నిదానపురం గ్రామానికి చెందిన కనపర్తి దానయ్య(49) భవన కార్మికుడిగా పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. గత మూడు రోజులుగా ఎండల తీవ్రత ఎక్కువగా ఉండటంతో అస్వస్థకు గురయ్యాడు. చికిత్స కోసం ఖమ్మం ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. దానయ్యకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.