మధిర, మార్చి 18 : రాష్ట్రంలో కాంగ్రెస్‌ది ప్రజా పాలన కాదని, మాదిగల వ్యతిరేక పాలన అని ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు కూరపాటి సునీల్ మాదిగ అన్నారు. మంగళవారం తాసిల్దార్ కార్యాలయం ఎదుట చేపట్టిన నిరసన దీక్ష 8వ రోజుకు చేరుకుంది. ఈ దీక్షలో పాల్గొన్న ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎస్సీ వర్గీకరణ చట్టాన్ని ప్రస్తుత ఉద్యోగ నియమకాల్లో వర్తింపజేయకుండా మాదిగ విద్యార్థి నిరుద్యోగులను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తుందన్నారు.
ఉద్యోగ నియమకాల ప్రక్రియలో ఎస్సీ వర్గీకరణ వర్తింపజేయాలన్నారు. ప్రస్తుత తెలంగాణ మంత్రివర్గ విస్తరణలో మాదిగలు ఇద్దరికి అవకాశం కల్పించాలని, నిండు సభలో రేవంత్ ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలన్నారు. లేకపోతే కాంగ్రెస్ పార్టీకి మాదిగలు బుద్ధి చెబుతారని హెచ్చరించారు. తక్షణమే ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించి, ఉద్యోగ నియమకాలకు వర్తింపజేసే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఎంఎస్పీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు మంద పిచ్చియ్య మాదిగ, ఎమ్మార్పీఎస్ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు ఆదూరి నాగమల్లేశ్వరరావు మాదిగ, ఎంఎస్సీ జిల్లా ఉపాధ్యక్షుడు కనకపుడి శ్రీను మాదిగ, ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు మేకల రాజా మాదిగ, ఎంఎస్పీ మండల నాయకులు రాయబారపు దాసు మాదిగ, తేళ్లూరి రాజారత్న మాదిగ, మండల అధ్యక్షుడు వేల్పుల పవన్ కళ్యాణ్ మాదిగ, మండల నాయకులు మారుపాక ఆశీర్వాదం మాదిగ, వెల్లంకి కాంతారావు మాదిగ, ఎమ్మార్పీఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.