కారేపల్లి, సెప్టెంబర్ 04 : వెయ్యి రోజుల కాంగ్రెస్ పాలన వైఫల్యాలను నిరసిస్తూ బీఆర్ఎస్ చేపట్టిన ఆందోళన కార్యక్రమంలో భాగంగా శనివారం కారేపల్లి క్రాస్ రోడ్డులో మండల పార్టీ ఆధ్వర్యంలో వంటావార్పు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ, ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు తాత మధుసూదన్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కోట్లాది ప్రజల కలల సహకారం ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకువచ్చిన ఘనుడు సీఎం కేసీఆర్ అన్నారు. 33 నెలలు, వెయ్యి రోజుల కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి పాలనలో సంపదను దోచుకోవడం,దాచుకోవడం తప్ప ప్రజలకు చేసింది ఏమీ లేదని దుయ్యబట్టారు.
ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నప్పటికీ అభివృద్ధి ముండ మోస్తుందని విమర్శించారు. ఈ మూడేళ్లలో అది చేసాం.. ఇది చేసాం అని కాంగ్రెస్ నాయకులు గ్రామాలలోకి వస్తే ప్రజలు తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. రూ.200 ఫించన్ ఇచ్చిన వైయస్ రాజశేఖర్ రెడ్డి దేవుడైతే రూ.2 వేలు పెన్షన్ ఇచ్చిన కేసీఆర్ ఏమి కావాలని ప్రశ్నించారు. ఇలా ఒక్కొక్కటి చెప్పుకుంటూ పోతే ప్రజల ముందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తల ఎక్కడ పెట్టుకోవాలో అర్థం కాలేని పరిస్థితి అన్నారు. అన్ని వర్గాల ప్రజలు తిరిగి మళ్లీ సీఎం కేసీఆర్ కావాలని ఆకాంక్షిస్తున్నారన్నారు.
ఈ కార్యక్రమంలో వైరా నియోజకవర్గ ఇన్చార్జి గుండా (ఆర్జేసీ), వైరా మాజీ ఎమ్మెల్యే బానోత్ చంద్రావతి, నియోజకవర్గ నాయకులు బానోత్ మనిషా లక్ష్మి, లకావత్ గిరిబాబు, ముత్యాల వెంకట అప్పారావు, కట్ట కృష్ణార్జున రావు, బాణాల వెంకటేశ్వరరావు, పోట్ల శ్రీనివాసరావు, మద్దెల రవి, సింగరేణి మండలం నాయకులు ముత్యాల సత్యనారాయణ, పున్నం వీరేందర్, రావూరి శ్రీనివాసరావు, వాంకుడోత్ జగన్, బానోత్ రాందాస్, శివరాత్రి అచ్చయ్య, తాత వెంకన్న, తాత ఉపేందర్, భానోత్ కుమార్, ఇస్లావత్ బన్సీలాల్, షేక్ గౌస్ ఉద్దీన్, సోమందుల నాగరాజు, దొంకేనా రవీందర్, ఖలీల్ అల్లా ఖాన్, పేర్ని వెంకటేశ్వర్లు, కారేపల్లి క్రాస్ రోడ్ బీఆర్ఎస్ యూత్ నాయకులు సిద్ధంశెట్టి నాగయ్య, షేక్ ఖాజావలి, గూగులోత్ రవి, బట్టు శ్రీనివాస్, షేక్ సైజన్, వేగ్గలం రాజు, పండు పాల్గొన్నారు.

కాంగ్రెస్ నాయకులు గ్రామాల్లోకొస్తే తరిమికొట్టాలి : ఎమ్మెల్సీ తాత మధుసూదన్