పినపాక, డిసెంబర్ 26: మండలంలోని ఏడూళ్లబయ్యారం, ఉప్పాక, సీతంపేట గ్రామాలకు చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు సోమవారం బీఆర్ఎస్లో చేరారు. మణుగూరులోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు వారందరికీ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కార్యకర్తలే బీఆర్ఎస్కు పునాదులని, వారందరినీ కంటికి రెప్పలా కాపాడుకుంటామని అన్నారు. బీఆర్ఎస్లో చేరిన వారిలో కొడెం నర్సింహారావు, అన్నపూర్ణ, ఎల్లబోయిన జనార్దన్, వార శంకర్ ఉన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు పగడాల సతీశ్‌రెడ్డి, దొడ్డా శ్రీనివాస్‌రెడ్డి, యగ్గడి శ్రీరామ్, ముక్కు వెంకటేశ్వరరెడ్డి, కంది సుధాకర్‌రెడ్డి, తాళ్లపల్లి యాదగిరి గౌడ్ తదితరులు పాల్గొన్నారు.