తరుగు పేరుతో నిలువు దోపిడీనా?
‘తరుగు పేరుతో అన్నదాతలను నిలువుదోపిడీ చేస్తారా?’ అంటూ సీపీఐ నేతలు, దాని అనుబంధ రైతు సంఘం నాయకులు కలిసి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కర్షకులకు నష్టం జరగకుండా పంటల సేకరణ ఎందుకు చేయలేరని నిలదీశారు. ఆరుగాలం కష్టించి అన్నదాతలు పండించిన పంటల కొనుగోలులో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు.
- కర్షకులకు నష్టం జరగకుండా పంటల సేకరణ చేయలేరా?
- రైతుల పంటల కొనుగోలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం
- సీపీఐ, దాని అనుబంధ రైతు సంఘం నేతల స్పష్టీకరణ
- భద్రాద్రి జిల్లాలో పలు మండలాల అధికారులకు వినతులు
జూలూరుపాడు/ అశ్వాపురం/ మణుగూరు టౌన్/ కొత్తగూడెం టౌన్, మే 15 : ‘తరుగు పేరుతో అన్నదాతలను నిలువుదోపిడీ చేస్తారా?’ అంటూ సీపీఐ నేతలు, దాని అనుబంధ రైతు సంఘం నాయకులు కలిసి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కర్షకులకు నష్టం జరగకుండా పంటల సేకరణ ఎందుకు చేయలేరని నిలదీశారు. ఆరుగాలం కష్టించి అన్నదాతలు పండించిన పంటల కొనుగోలులో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు.
రైతుల నుంచి ధాన్యం, మక్కల కొనుగోళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ భద్రాద్రి జిల్లా వ్యాప్తంగా సీపీఐ, దాని అనుబంధ రైతు సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం ప్రభుత్వ కార్యాలయాల ఎదుట ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. ఆయా ఆఫీసుల ఎదుట ధర్నాలు నిర్వహించి అధికారులకు వినతిపత్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. ‘అన్నదాతలు చెమటోడ్చి పండించిన పంటలను కొనుగోలు కేంద్రాలకు తీసుకొస్తే సాకులు పేరుతో వారి కంట కన్నీళ్లు తెప్పిస్తారా?’ అంటూ ప్రశ్నించారు. తరుగు పేరుతో రైతుల నుంచి అదనంగా సేకరించిన ధాన్యానికి లెక్కగట్టి దాని పైకాన్ని రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలని డిమాండ్ చేశారు. అలాగే, ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం కళ్లు తెరవాలని, కొనుగోలు కేంద్రాల్లో రైతుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్లో ప్రత్యేక వేడుక!
Madhya Pradesh | మధ్యప్రదేశ్లో భక్తులపై దూసుకెళ్లిన భారీ ట్రక్కు 12 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
Bigg Boss 10 | బిగ్బాస్లో షాలినికి నాగార్జున క్లాస్.. రోహిత్, అమన్లకు షాక్.. వచ్చే వారం కెప్టెన్సీకి నో!
Dasara Safety Tips | దసరాకు ఊరెళ్తున్నారా జాగ్రత్త..! గ్రేటర్లో దొంగల కలకలం
Rain | తెలంగాణలో మూడు రోజులు వానలు!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

