హైదరాబాద్ : గూడు చెదిరి.. గుండె పగిలి.. నడి రోడ్డుపై కట్టుబట్టలతో మిగిలిన నిరుపేదలపై కాంగ్రెస్ సర్కార్ కర్కశత్వాన్ని ప్రదర్శిస్తున్నది. ఖమ్మం అర్బన్ మండలం వెలుగుమట్ల ప్రాంతంలోని భూదాన్ భూముల్లో ఏండ్ల క్రితం కట్టుకున్న ఇండ్లను కూల్చడంతో వీధిన పడ్డ బాధిత కుటుంబాలను ఆదుకుంటామని కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా ప్రకటించింది. కానీ, ఆచరణలో అందుకు భిన్నంగా ఉంది. సర్కార్ ఎలాంటి నోటీసులూ ఇవ్వకుండా ప్రత్యామ్నాయం చూపకుండా ఇండ్లను కూల్చివేసిన సర్కార్ ఇప్పుడు నిరుపేదలను గాలికి వదిలేసింది.
ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నా కూడా అంబేద్కర్ భవన్, ఇతర ప్రభుత్వ భవనాల్లో నివాసం ఉంటున్న 900 మంది బాధితులకు కనీస వసతులు కల్పించకపోవడం సిగ్గు చేటని పలువురు ఆరోపిస్తున్నారు. కనీసం బాత్రూం తలుపులు కూడా లేవని, కొంచెం కూడా పరిశుభ్రత లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి వెంటనే వసతులు కల్పించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
ఖమ్మం వెలుగుమట్ల బాధితులను గాలికి వదిలేసిన కాంగ్రెస్ ప్రభుత్వం
అంబేద్కర్ భవన్ మరియు ఇతర ప్రభుత్వ భవనాల్లో నివాసం ఉంటున్న 900 మంది బాధితులకు కనీస వసతులు కల్పించని ముగ్గురు మంత్రులు
కనీసం బాత్రూం తలుపులు కూడా లేవని, కొంచెం కూడా పరిశుభ్రత లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్న బాధితులు https://t.co/74c8uXDGg9 pic.twitter.com/EPzHcIgonr
— Telugu Scribe (@TeluguScribe) March 6, 2026