ఖమ్మం ఎడ్యుకేషన్, డిసెంబర్ 30: సమగ్ర శిక్షా ఉద్యోగులు 20 రోజులుగా నిర్వహిస్తున్న సమ్మెకు బీఆర్ఎస్ నేతలు రాకేశ్రెడ్డి, గుండాల కృష్ణ సంఘీభావం ప్రకటించారు. ఖమ్మం కలెక్టరేట్ ధర్నాచౌక్ వద్ద కొనసాగుతున్న సమ్మెను సోమవారం వారు సందర్శించారు.
అక్కడ నిరసన కార్యక్రమంలో ఉన్న ఉద్యోగులను కలిశారు. వారితో మాట్లాడి వారి సమస్యల గురించి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రభుత్వం సమగ్ర శిక్షా ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. వారి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. అనంతరం ఉద్యోగులు ఒంటికాలితో నడిచి నిరసన వ్యక్తం చేశారు. ఎస్ఎస్ఏ ఉద్యోగులు పాల్గొన్నారు.