ఖమ్మం, జనవరి 8 : జాతీయ రహదారుల నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని రాష్ట్ర వ్యవసాయ, మారెటింగ్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆర్అండ్బీ అధికారులను ఆదేశించారు. ఖమ్మం జిల్లాలో నిర్మిస్తున్న జాతీయ రహదారుల పనుల పురోగతి, రైతులకు అందించే పరిహారంపై సోమవారం హైదరాబాద్‌లోని సచివాలయంలో ఆర్అండ్బీ అధికారులతో మంత్రి సమీక్షించారు. ఖమ్మం-దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ హైవే, అమరావతి-నాగ్‌పూర్ గ్రీన్ ఫీల్డ్ జాతీయ రహదారి పనుల పురోగతిపై చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల.. ఖమ్మం-దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ హైవేకు సంబంధించి ఖమ్మం జిల్లాలోని తెలంగాణ రాష్ట్ర సరిహద్దు వరకు ఎంట్రీ, ఎగ్జిట్ పాస్‌ల నిర్మాణం ఎకడెకడ చేపడుతున్నారన్న వివరాలు అడిగి తెలుసుకున్నారు. విజయవాడ-జగదల్పూర్ హైవే వద్ద గ్రీన్ ఫీల్డ్ హైవేకు ప్రవేశ, ముగింపు ద్వారాలు ఏర్పాటు చేయాలని సూచించారు. ఫలితంగా సత్తుపల్లి ప్రజలతోపాటు నూజివీడు, తిరువూరు ప్రాంతవాసులకు రవాణా సౌకర్యం సౌలభ్యంగా ఉంటుందన్నారు.
అమరావతి-నాగ్‌పూర్ గ్రీన్ ఫీల్డ్ హైవేకు సంబంధించిన అలైన్‌మెంట్‌ను పునఃపరిశీలించాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో భూములు కోల్పోయిన రైతులకు మారెట్ ధరకు అనుగుణంగా పరిహారం చెల్లించే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. ఖమ్మం నియోజకవర్గంతోపాటు పరిసర ప్రాంతాల్లో జాతీయ రహదారి కోసం కొత్తగా చేపట్టే భూ సేకరణలో నిర్వాసితులకు ఎకడా అన్యాయం జరగకుండా చూడాలన్నారు. నిర్వాసితులకు మారెట్ రేటు కన్నా పరిహారం ఎక్కువగా చెల్లించేలా చూడాలన్నారు. ఖమ్మం-దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ హైవేలో ఖమ్మం నియోజకవర్గ పరిధిలో అవసరమైన అన్ని ప్రాంతాల్లో సర్వీసు రోడ్లు, అండర్ పాస్‌లు ఏర్పాటు చేయాలన్నారు. గ్రీన్ ఫీల్డ్ రహదారికి భూములు ఇచ్చిన రైతులతోపాటు రహదారి పకన సాగు చేసుకునే రైతాంగానికి భవిష్యత్తులో ఎకడా ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని మంత్రి తుమ్మల దిశానిర్దేశం చేశారు. సమావేశంలో ఆర్అండ్బీ సెక్రటరీ శ్రీనివాసరాజుతోపాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.