మామిళ్లగూడెం, జనవరి 8 : ప్రజా సమస్యల పరిషారానికి వెంటనే చర్యలు చేపట్టాలని కలెక్టర్ వీపీ గౌతమ్ జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన గ్రీవెన్స్ డేలో ప్రజల నుంచి సమస్యల దరఖాస్తులను స్వీకరించారు. సత్తుపల్లి మండలం బేతుపల్లికి చెందిన గుడిమెట్ల కన్యాకుమారి, చింతకాని మండలం పాతర్లపాడుకు చెందిన మారపూడి నాగేశ్వరరావు, కల్లూరు మండలం రఘునాథగూడేనికి చెందిన మారీదు సీతారామమ్మ భూ సమస్యలకు కలెక్టర్ సత్వరమే పరిషారం చూపి ఉత్తర్వు ప్రతులను జారీ చేశారు.
జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల దరఖాస్తులు స్వీకరించి ఆయా సమస్యల పరిష్కారానికి సంబంధిత అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో అసిస్టెంట్ శిక్షణ కలెక్టర్ మయాంక్సింగ్, అదనపు కలెక్టర్ డి.మధుసూదన్నాయక్, ఆర్డీవో గణేశ్, ఇతర అధికారులు పాల్గొన్నారు.