ఖమ్మం :బతుకమ్మ వేడుకల సందర్భంగా సర్దార్ పటేల్ స్టేడియంలో మంగళవారం జరగనున్న బతుకమ్మ సంబురాలకు ఏర్పాట్లు పూర్తి చేయాలని ఖమ్మం జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్ అధికారులను ఆదేశించారు. బతుకమ్మ సబురాలలో జిల్లా ప్రజలు అధికారులు, ప్రజా ప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొనాలని కోరారు. సద్దుల బతుకమ్మ, బతకమ్మల నిమజ్జన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.
రేపు సాయంత్రం 4గంటలకు సర్థార్ పటేల్ స్టేడియంలో జరగనున్న బతుకమ్మ సంబురాలలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొనే విధంగా ఏర్పాట్లు చేయాలని సంక్షేమ శాఖ, డీఆర్డీఏ, మెప్మా అధికారులకు సూచించారు. బతుకమ్మల నిమజ్జనం రోజున మున్నేరు కాలువ ఒడ్డు, ప్రకాష్‌నగర్ ప్రాంతాలలో మహిళలు బతుకమ్మలు అడుకుని నిమజ్జనం చేసుకునే విధంగా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. అవసరమైన లైటింగ్, పోలీసు బందోబస్తులు ఉండాలని ఆయన సూచించారు.