రఘునాథపాలెం, మే 5 : వ్యవసాయరంగంలో శాస్త్రవేత్తల సలహాలు, సూచనలు పాటిస్తూ అధిక దిగుబడులు సాధించి లాభాలు పొందాలని కలెక్టర్ ముజమ్మిల్‌ఖాన్ రైతులకు సూచించారు. సోమవారం రఘునాథపాలెం మండలం ర్యాంకాతండా రైతువేదికలో జరిగిన ‘రైతు ముంగిట శాస్త్రవేత్తలు’ కార్యక్రమంలో ముఖ్యఅతిధిగా పాల్గొని మాట్లాడారు. శాస్త్రవేత్తల సూచనల మేరకు తక్కువ మోతాదులో రసాయన ఎరువులు, పురుగు మందులను వినియోగించాలన్నారు. అవసరం మేరకు రసాయనాలను వినియోగించి నేలతల్లి ఆరోగ్యాన్ని కాపాడాల్సిన అవసరం ఉందన్నారు.
అనంతరం వైరా కేవీకే శాస్త్రవేత్త రవికుమార్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం సూచించిన ఆరు అంశాలను రైతులకు వివరించారు. కార్యక్రమంలో జిల్లా రైతుసంఘం నాయకులు నల్లమల వెంకటేశ్వరరావు, జిల్లా వ్యవసాయ అధికారి దినసరి పుల్లయ్య, ఖమ్మం డివిజన్ ఆత్మ చైర్మన్ దిరిశాల చిన్న వెంకటేశ్వర్లు, ఖమ్మంఅర్బన్ ఏడీఏ కొంగర వెంకటేశ్వరరావు, సహకార సొసైటీల అధ్యక్షులు మందడపు సుధాకర్, తాతా రఘురాం, ఏవో ఉమామహేశ్వర్‌రెడ్డి, ఎంపీడీవో అశోక్‌కుమార్, డివిజన్ ఉద్యానవన అధికారి నగేశ్, విస్తరణాధికారులు ప్రతిభ, వేదవ్యాస్, వెంకటేశ్, సాయి శిరణ్మయి పాల్గొన్నారు.