సీఎంఆర్ బియ్యాన్ని నెలాఖరులోగా డెలివరీ ఇవ్వాలి
సీఎంఆర్ రైస్ డెలివరీకి ప్రభుత్వం ఈ నెల 31 వరకు గడువు ఇచ్చిందని అదనపు కలెక్టర్ డి.మధుసూదన్‌నాయక్ అన్నారు. అందుకని ప్రభుత్వ లక్ష్యం మేరకు మిల్లర్లందరూ సీఎంఆర్ రైస్ డెలివరీని ఆ గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు.
- రైస్ మిల్లులను పూర్తి సామర్థ్యంతో నిర్వహించి ఉత్పత్తిలో వేగం పెంచాలి
- సీఎంఆర్ డెలివరీలో లక్ష్యం చేరని మిల్లర్లను బ్లాక్ లిస్ట్‌లో ఉంచుతాం
- రైస్ మిల్లుల తనిఖీలో అదనపు కలెక్టర్ మధుసూదన్‌నాయక్
ఖమ్మం రూరల్, జనవరి 28: సీఎంఆర్ రైస్ డెలివరీకి ప్రభుత్వం ఈ నెల 31 వరకు గడువు ఇచ్చిందని అదనపు కలెక్టర్ డి.మధుసూదన్‌నాయక్ అన్నారు. అందుకని ప్రభుత్వ లక్ష్యం మేరకు మిల్లర్లందరూ సీఎంఆర్ రైస్ డెలివరీని ఆ గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఖమ్మం రూరల్ మండలం మంగళగూడెంలోని సత్యనారాయణ సిలి అండ్ సార్టెక్స్ రైస్ మిల్లును ఆదివారం ఆయన తనిఖీ చేశారు. వానకాలం సీఎంఆర్ రైస్ డెలివరీ, కేటాయించిన లక్ష్యం, అందించిన రైస్ వివరాల గురించి అడిగి తెలుసుకున్నారు.
రైస్ మిల్లులు పూర్తి సామర్థ్యం మేర నిర్వహించి రైస్ ఉత్పత్తిలో వేగం పెంచి లక్ష్యం మేరకు సీఎంఆర్ రైస్ డెలివరీ చేయాలని ఆదేశించారు. నిర్దేశిత సమయంలో లక్ష్యాలు చేరుకోని రైస్ మిల్లులపై తగిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. వానకాలం పంటకు సంబంధించిన పెండింగ్ ఉన్న సీఎంఆర్ రైస్ డెలీవరి దిశగా అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. సీఎంఆర్ రైస్ డెలివరీకి ఇకపై గడువు పొడిగింపు ఉండదని స్పష్టం చేశారు. జిల్లా వ్యాప్తంగా ఇంకా 3,354.577 మెట్రిక్ టన్నుల సీఎంఆర్ రైస్ డెలివరీ చేయాల్సి ఉందన్నారు. లక్ష్యం చేరని మిల్లర్లను బ్లాక్ లిస్ట్‌లో ఉంచుతామని హెచ్చరించారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

