టేకులపల్లి, ఏప్రిల్ 20: రాష్ట్రంలో నూతనంగా అమలుచేస్తున్న భూ భారతి చట్టంతో భూ సమస్యలు సులభ పద్ధతిలో పరిష్కారమవుతాయని భద్రాద్రి కలెక్టర్ జితేశ్ వి పాటిల్ పేర్కొన్నారు. టేకులపల్లి తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో తహసీల్దార్ నాగభవాని అధ్యక్షతన ఆదివారం ఏర్పాటుచేసిన భూభారతి చట్టం అవగాహన సదస్సుల్లో స్థానిక ఎమ్మెల్యే కోరం కనకయ్యతో కలిసి కలెక్టర్ మాట్లాడారు.
నూతన భూభారతి చట్టం ద్వారా భూముల సమస్యలు పరిష్కారమవుతాయని, రైతుల భూములకు ఐడీ ఇస్తామని అన్నారు. రైతు పట్టాదారు పాస్ పుస్తకంలో అతడి పొలాన్ని మ్యాపింగ్ చేస్తామని అన్నారు. దీంతో వారి భూములకు రక్షణ ఉంటుందని తెలిపారు. కొత్తగూడెం ఆర్డీవో మధు, ఇల్లెందు ఏడీఏ లాల్‌చంద్, ఎంపీడీవో రవీంద్రరావు, సీఐ సురేశ్, సొసైటీ చైర్మన్ లక్కినేని సురేందర్‌రావు, ఏవో అన్నపూర్ణ, డిప్యూటీ తహసీల్దార్ ముత్తయ్య, ఎంపీవో గణేశ్ గాంధీ తదితరులు పాల్గొన్నారు.