భద్రాద్రి కొత్తగూడెం, జూలై 31 (నమస్తే తెలంగాణ) : వరదకు సంబంధించిన పూర్తి వివరాలను ఎప్పటికప్పుడు ముంపు ప్రాంత ప్రజలకు తెలియజేస్తూ వారిని అప్రమత్తం చేయాలని కలెక్టర్ జితేశ్ వి పాటిల్ ఆదేశించారు. ఐడీవోసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన గోదావరి వరదల కంట్రోల్ రూమ్‌ను బుధవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడి సిబ్బంది అందిస్తున్న సేవల గురించి అడిగి తెలుసుకున్నారు.
మీరిచ్చే సమాచారంపైనే అధికారులు తీసుకునే చర్యలు ఉంటాయని, మీరు అలర్ట్‌గా ఉంటూ.. అందరినీ అప్రమత్తం చేయాలని సూచించారు. కంట్రోల్ రూమ్‌కు వచ్చిన ప్రతీ ఫిర్యాదుపై తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. విధుల పట్ల అలసత్వం వహిస్తే సహించేది లేదని ఆయన హెచ్చరించారు.