కొత్తగూడెం ఎడ్యుకేషన్, ఆగస్టు 18 : మొఘల్ రాజుల కాలంలో దౌర్జాన్యాలు, అన్యాయాలకు వ్యతిరేకంగా పోరాడిన సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ పోరాటస్ఫూర్తితో ప్రతిఒక్కరూ ముందుకుసాగాలని కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. ఆదివారం కలెక్టరేట్లో బీసీ సంక్షేమశాఖ ఆధ్వరంలో పాపన్నగౌడ్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పాపన్నగౌడ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి మాట్లాడారు. పాపన్నగౌడ్ పోరాటస్ఫూర్తి అనుసరణీయమన్నారు.
మామిళ్లగూడెం, ఆగస్టు 18 : ఢిల్లీని పరిపాలించిన మొఘలులను ఎదిరించడమే కాకుండా గోల్కొండ కోటపై తెలంగాణ కీర్తి పతకాన్ని ఎగురవేసిన ధీరుడు సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ అని జిల్లా రెవెన్యూ అధికారి ఎం.రాజేశ్వరి అన్నారు. ఆదివారం పాపన్న 374వ జయంతిని పురస్కరించుకుని లకారం ట్యాంక్‌బండ్ వద్ద ఉన్న పాపన్న విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బడుగు, బలహీనవర్గాల సంక్షేమం కోసం పోరాటం చేసిన గొప్ప వీరుడు సర్దార్ పాపన్న అని అన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో పాపన్న వీరగాధలను జానపద పాటలు, బుర్రకథల రూపంలో తెలంగాణ ప్రజలు పాడుకుని చైతన్యం పొందారన్నారు.
నేటితరానికి వారి జీవితం ఆదర్శమని, వారిని స్మరించుకంటూ వారి ఆశయాలను కొనసాగించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా బీసీ సంక్షేమాధికారి జ్యోతి, తెలంగాణ గౌడ సంఘం జిల్లా అధ్యక్షుడు నెహ్రూ, ఉపాధ్యక్షుడు వెంకటేశ్వర్లు, వివిధ సంఘాల నాయకులు వెంకటరమణ, శ్రీరాములు, శ్రీనివాసరావు, ఆంజనేయులు, ఆర్జేసీ కృష్ణ, నాగభూషణం, వెంకటేశ్వర్లు, సంగరాజు, వెంకన్నగౌడ్, తిరుమలరావు, సుదర్శన్, అంజయ్య, లింగయ్య, పగడాల నాగరాజు, విజయ్‌కుమార్, రవికుమార్, శంకర్రావు, వెంకట్రామయ్య, సోమరాజు, వెంకటేష్, రామ్మూర్తి, నాగేశ్వరరావు, సురేందర్‌గౌడ్, రామారావు, నిరోషా, షకీనా, అధికారులు పాల్గొన్నారు.