ప్రమాదాలు అధికంగా జరిగే ప్రాంతాల్లో ప్రత్యేక చర్యలు చేపట్టాలి
జిల్లాలో రోడ్డు ప్రమాదాలు తగ్గించేందుకు ప్రమాదాలు అధికంగా జరిగే ప్రాంతాల్లో ప్రత్యేక చర్యలు చేపట్టాలని, జాతీయ రహదారులపై రోడ్డు భద్రతా ప్రమాణాలను పూర్తిస్థాయిలో అమలు చేయాలని కలెక్టర్ దివాకర టీఎస్ అధికారులను ఆదేశించారు.
- రోడ్డు భద్రతా ప్రమాణాలను పూర్తిస్థాయిలో అమలుచేయాలి
- అధికారుల సమావేశంలో ఖమ్మం కలెక్టర్ దివాకర టీఎస్
మామిళ్లగూడెం, జూలై 21: జిల్లాలో రోడ్డు ప్రమాదాలు తగ్గించేందుకు ప్రమాదాలు అధికంగా జరిగే ప్రాంతాల్లో ప్రత్యేక చర్యలు చేపట్టాలని, జాతీయ రహదారులపై రోడ్డు భద్రతా ప్రమాణాలను పూర్తిస్థాయిలో అమలు చేయాలని కలెక్టర్ దివాకర టీఎస్ అధికారులను ఆదేశించారు. జాతీయ రహదారులపై రోడ్డు భద్రత చర్యలు, ప్రమాదాల నివారణ, సుప్రీంకోర్డు మార్గదర్శకాల అమలు, అనుసరణ నివేదికల సమర్పణ, ప్రమాదాల తగ్గింపునకు తీసుకోవాల్సిన చర్యలు, జాతీయ రహదారుల వెంట ఉన్న ఆసుపత్రుల మ్యాపింగ్, ఆక్రమణల తొలగింపు, అత్యవసర స్పందన వ్యవస్థ తదితర అంశాలపై జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, సీపీలు సహా సంబంధిత అధికారులతో మంగళవారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర రవాణా శాఖ కమిషనర్ ఇలంబర్తి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ వీసీకి ఖమ్మం నుంచి కలెక్టర్ దివాకర, సీపీ సునీల్‌దత్ హాజరయ్యారు. అనంతరం కలెక్టరేట్లో సంబంధిత అధికారులతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో అధికంగా ప్రమాదాలు జరిగే ప్రాంతాల్లో ప్రమాదాల నివారణకు చర్యలను వేగవంతం చేయాలని ఆదేశించారు. జాతీయ రహదారుల వెంట అవసరమైన చోట పార్కింగ్ ప్రాంతాలు గుర్తించాలన్నారు. ప్రతి నెలా మూడో శుక్రవారం జిల్లా రోడ్డు భద్రత కమిటీ సమావేశాన్ని తప్పనిసరిగా నిర్వహించాలని, రోడ్డు భద్రత చర్యల పురోగతిని సమీక్షించాలని సూచించారు. ఆర్అండ్బీ ఎస్ఈ యుగంధర్‌రావు, డీఎంహెచ్‌వో డాక్టర్ రామారావు, ఎన్‌హెచ్ పీడీ దివ్య, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

