మాదకద్రవ్య రహిత సమాజమే లక్ష్యం
మాదకద్రవ్య రహిత సమాజమే లక్ష్యంగా ముందుకు సాగాలని కలెక్టర్ దివాకర టీఎస్ పిలుపునిచ్చారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఖమ్మం మమత రోడ్డులోని టాటా సర్వీస్ సెంటర్ నుంచి లకారం ట్యాంక్ బండ్ వరకు నిర్వహించిన అవగాహన ర్యాలీని కలెక్టర్, సీపీ సునీల్‌దత్, మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్యలతో కలిసి శుక్రవారం ప్రారంభించారు.
- అవగాహన ర్యాలీలో కలెక్టర్ దివాకర టీఎస్, సీపీ సునీల్‌దత్
మామిళ్లగూడెం, జూన్ 26: మాదకద్రవ్య రహిత సమాజమే లక్ష్యంగా ముందుకు సాగాలని కలెక్టర్ దివాకర టీఎస్ పిలుపునిచ్చారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఖమ్మం మమత రోడ్డులోని టాటా సర్వీస్ సెంటర్ నుంచి లకారం ట్యాంక్ బండ్ వరకు నిర్వహించిన అవగాహన ర్యాలీని కలెక్టర్, సీపీ సునీల్‌దత్, మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్యలతో కలిసి శుక్రవారం ప్రారంభించారు.
విద్యార్థులు, యువత, పోలీస్, వివిధ శాఖల అధికారులు, సిబ్బందితో రన్లో కలెక్టర్, సీపీ పాల్గొని స్ఫూర్తినిచ్చారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దేశ నిర్మాణంలో కీలక పాత్ర పోషించే యువత చెడు వ్యసనాలకు బానిసలు కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరిపై ఉందన్నారు. మాదక ద్రవ్యాలు, మత్తు పానీయాలు సేవించడం వ్యాధుల కంటే ప్రమాదకరమని అన్నారు. డ్రగ్స్ నియంత్రణ కేవలం అధికారులు మాత్రమే చేయలేరని, ప్రజలంతా సమష్టిగా ఉంటూ అధికారులకు సహకరిస్తే మెరుగైన ఫలితాలు లభిస్తాయన్నారు.
సీపీ సునీల్‌దత్ మాట్లాడుతూ మాదకద్రవ్యాల నిర్మూలనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై భావితరాలకు మంచి భవిష్యత్‌ను అందించాలన్నారు. యువత దృష్టి అంతా తమ జీవిత లక్ష్యంపైనే ఉండాలని, నిషేధిత గంజాయి, డ్రగ్స్‌కు అలవాటుపడి జీవితాలను నాశనం చేసుకోవద్దన్నారు. ఎక్కడైనా గంజాయి, ఇతర మత్తు పదార్థాలు విక్రయించినట్లు సమాచారం ఉంటే వెంటనే 1908కు సమాచారం అందించాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు. అనంతరం ప్రజలు, యువత, విద్యార్థులు, అధికారులతో కలిసి డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణంపై ప్రతిజ్ఞ చేయించారు. ఏసీపీ రమణమూర్తి, ఎస్బీ ఏసీపీ మహేశ్, ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్, సీఐలు, ఎస్ఐలు తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jantar Mantar | జంతర్ మంతర్ ఇకపై నిరసన వేదిక కాదు.. నిరసనల కోసం మూడు కొత్త ప్రాంతాలు
Pakistan | పాక్‌లో ముదురుతున్న రాజకీయ సంక్షోభం.. ఖైబర్ పఖ్తున్ఖ్వా గవర్నర్ ఇంటికి నిప్పు..!
AA 23 | అల్లు అర్జున్- లోకేష్ కనగరాజ్ సినిమా అప్డేట్.. ఆలస్యం కానుందనే వార్తలకు చెక్ పెట్టిన దర్శకుడు!
Sand Dumps | రైల్వే పనుల ముసుగులో ఇసుక డంపులు..అక్రమ నిల్వలపై అనుమానాలు
Harish Rao | రైతు వేదికల దగ్గరకు రండి అని రైతులతో ఆటలాడుతున్నారు.. అధికారులపై హరీశ్ రావు ఫైర్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

