ప్రభుత్వ పాఠశాలలు, వసతిగృహాల్లో.. కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు
ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాల్లో విద్యార్థులకు అందుతున్న సదుపాయాల విషయంలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని భద్రాద్రి కలెక్టర్ అంకిత్ స్పష్టం చేశారు. జూలూరుపాడు మండలంలోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయం, జూనియర్ కళాశాల, పడమటనర్సాపురం గ్రామంలోని గిరిజన బాలికల ఉన్నత పాఠశాలలను మంగళవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.
- విద్యార్థులకు వసతుల కల్పనలో సిబ్బంది నిర్లక్ష్యంపై ఆగ్రహం
- కుళ్లిన కూరగాయలను కిచెన్‌లో ఎందుకుంచారంటూ ప్రశ్నలు
జూలూరుపాడు, మార్చి 31: ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాల్లో విద్యార్థులకు అందుతున్న సదుపాయాల విషయంలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని భద్రాద్రి కలెక్టర్ అంకిత్ స్పష్టం చేశారు. జూలూరుపాడు మండలంలోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయం, జూనియర్ కళాశాల, పడమటనర్సాపురం గ్రామంలోని గిరిజన బాలికల ఉన్నత పాఠశాలలను మంగళవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యా ప్రమాణాలు, ఆహార నాణ్యత, మౌలిక వసతులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కస్తూర్బాగాంధీ విద్యాలయంలో నేరుగా 8వ తరగతి గదిలోకి వెళ్లి విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులతో ఇంగ్లిష్ పుస్తకం చదివించి వారి పఠనా సామర్థ్యాలను పరిశీలించారు.
అనంతరం పాఠశాలలోని ఆర్వో ప్లాంటును పరిశీలించారు. అది పనిచేయడం లేదని, మరమ్మతుకు గురైందని, బయట నుంచి నీళ్లు తెప్పిస్తున్నామని అక్కడి సిబ్బంది కలెక్టర్‌తో చెప్పారు. వారం రోజుల్లో ఆర్వో ప్లాంటు మరమ్మతు చేయించి వినియోగించాలని ఆదేశించారు. విద్యార్థులు చేతులు శుభ్రం చేసుకునేచోట ట్యాపులు సరిగా పనిచేయకపోవడంపైనా సిబ్బందిని ప్రశ్నించారు. అనంతరం, పడమటనర్సాపురం బాలికల ఉన్నత పాఠశాలకు వెళ్లి తనిఖీలు చేశారు. కిచెన్ స్టోర్ రూంలో వంట కోసం ఉంచిన కూరగాయల్లో కుళ్లినవి, దుర్వాసన వస్తున్నవి ఉండడాన్ని గమనించారు. ‘ఇలాంటి ఆహారం వడ్డిస్తారా?’ అంటూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మెనూలో బీట్రూట్ వంటి పోషక విలువలు కలిగిన ఆహారాన్ని వడ్డించాలని ఆదేశించారు.
పాఠశాలలోని బయోమెట్రిక్ యంత్రాలు సరిగా పనిచేయకపోవడం పట్ల అసహనం వ్యక్తం చేశారు. వాటికి వెంటనే మరమ్మతులు చేయించాలని, లేకుంటే తొలగించాలని ఆదేశించారు. బయోమెట్రిక్ యంత్రాలు అలంకార ప్రాయంగా గోడలకు ఎందుకని ప్రశ్నించారు. మెనూ పాటించకపోయినా, పరిశుభ్రతలో నిర్లక్షం వహించినా అధికారులపై చర్యలు తప్పవని స్పష్టం చేశారు. తహసీల్దార్ శ్రీనివాస్, ఇన్చార్జి ఎంపీడీవో తాళ్లూరి రవి, ఎంఈవో జుంకీలాల్, ఎస్వో పద్మజ, ప్రధానోపాధ్యాయురాలు సుభద్ర, ఎంపీవో తులసీరాం తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Smit Machchhar | ఫ్లై దుబాయ్ ఘటన.. ఇండియన్ కెప్టెన్‌పై కో పైలట్ దాడి.. కేసు నమోదు చేసిన ఎన్ఐఏ
Gautam Prasad | ‘పెండింగ్‌లో రూ.4 వేల కోట్ల రైల్వే ప్రాజెక్ట్.. ఎంపీ వంశీకృష్ణ నీకు దమ్ముంటే ప్రజలకు సమాధానం చెప్పు’
Ranabaali | టికెట్ రేట్ల పెంపుపై విజయ్ దేవరకొండ సంచలన నిర్ణయం?.. ఇకపై ఆ ప్రసక్తే లేదట!
Medical Tests | ప్రతి ఒక్కరు తరచూ చేయించుకోవాల్సిన ముఖ్యమైన వైద్య పరీక్షలు ఇవే..
‘బీఆర్ఎస్ నియోజకవర్గ ముఖ్యకార్యకర్తల సమావేశాన్ని జయప్రదం చేయండి’
ట్రెండింగ్ వార్తలు
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?

