ఖమ్మం రూరల్ : ఖమ్మం జిల్లా తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయిస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం నూతన సంవత్సర వేడుకలు సంబురంగా జరిగాయి. ఖమ్మం నగరంలోని బాలల సదనంలో జిల్లా అధ్యక్షుడు ప్రసాద్, ప్రధాన కార్యదర్శి టి సునీల్ రెడ్డి, కెవివి ప్రసాద్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలకు జిల్లా కలెక్టర్ అనుద్దీపదుర్శెట్టి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బాలల సదనంలోని పిల్లలతో కలిసి కలెక్టర్, అసోసియేషన్ నాయకులు కేక్ కట్ చేసి పిల్లలకు అందజేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ అనుదీప్ మాట్లాడుతూ నూతన కార్యవర్గం ఇలాంటి కార్యక్రమం ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. సమాజంలోని అభాగ్యులను ఆదుకునేందుకు ఎంప్లాయిస్ అసోసియేషన్ మరిన్ని కార్యక్రమాలు చేపట్టాలని ఆయన సూచించారు. పిల్లలకు ఒకే రకమైన రంగుల దుస్తులను అందజేసి వారిసంతోషాల్లో కీలక పాత్ర పోషించిన ప్రసాద్ చొరవను కలెక్టర్ ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి వేల్పుల విజేత. జిల్లా బాలల పరిరక్షణ అధికారి విష్ణు వందన, బాలల సదనం పర్యవేక్షకురాలు లక్ష్మి, ప్రసాద్ జిల్లా కోశాధికారి క్రాంతి కుమార్, తదితరులు పాల్గొన్నారు.