ఖమ్మం, నవంబర్ 23: ఖమ్మంలోని భక్త రామదాసు కళాక్షేత్రాన్ని ఆధునీకరిస్తామని కలెక్టర్ అనుదీప్ అన్నారు. స్థానిక భక్త రామదాసు కళాక్షేత్రంలో ఆదివారం రాత్రి ‘నెలనెలా వెన్నెల’ 100వ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ముందుగా, తెలంగాణ గేయ రచయిత అందెశ్రీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు.
కలెక్టర్ మాట్లాడుతూ.. ఆదరణ కోల్పోతున్న కళారంగాన్ని, కళాకారులను ప్రోత్సహిస్తున్న ‘నెలనెలా వెన్నెల’ నిర్వాహకులను అభినందించారు. నాగబత్తిని మాలతి జీవిత సాఫల్య పురస్కారాన్ని డీవీఎస్ నారాయణ, బీరెల్లి సత్యంలకు ప్రదానం చేశారు. ఖమ్మం కళాపరిషత్ అధ్యక్షుడు నాగబత్తిని రవి, బాధ్యులు సుబ్రహ్మణ్య కుమార్, జగన్మోహన్రావు, నామ లక్ష్మీనారాయణ, సదానందం తదితరులు పాల్గొన్నారు.