ఖమ్మం, జూలై 14 : రెవెన్యూ వ్యవస్థలో అధికారులు తమ విధులు, బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో రెవెన్యూ శాఖపై కలెక్టర్.. అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డితో కలిసి సంబంధిత అధికారులతో సోమవారం సాయంత్రం సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రెవెన్యూ అధికారులు ప్రజలతో సత్సంబంధాలు పెట్టుకోవాలని, కార్యాలయ ప్రాంగణంలో దళారులకు ఆసారం ఇవ్వొద్దన్నారు. ప్రతీ మండలంలో భూ భారతి దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిషరించాలన్నారు. మండలాలకు కలెక్టరేట్, మంత్రులు, ఎంపీలు, ప్రజాప్రతినిధుల నుంచి వచ్చిన దరఖాస్తులకు ప్రాధాన్యత కల్పించి పరిషరించాలన్నారు.
మండలంలో మీసేవ ఆపరేటర్లను పూర్తిస్థాయిలో తహసీల్దార్ పర్యవేక్షించాలని, నిర్ణయించిన ధరల కంటే అధికంగా వసూలు చేసినట్లు తెలిస్తే లైసెన్స్ రద్దు చేయాలని ఆదేశించారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెకులు కూడా సకాలంలో లబ్ధిదారులకు అందేలా చూడాలన్నారు. కోర్టు కేసుల్లో స్పష్టమైన కౌంటర్లు దాఖలు చేయాలని, లీగల్ సెల్‌తో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ ప్రభుత్వ భూముల సంరక్షణకు చర్యలు చేపట్టాలన్నారు.
నీటిపారుదల ప్రాజెక్టులు, రైల్వే లైన్, ఆర్అండ్బీ, జాతీయ రహదారులు, మున్నేరు రిటైనింగ్ వాల్ తదితర అభివృద్ధి పనులకు సంబంధించి పెండింగ్ భూ సేకరణ వేగంగా పూర్తి చేయాలని తెలిపారు. మన పరిధి మేరకు అత్యధికంగా పరిహారం నిర్వాసితులకు అందేలా చూడాలని, భూ సేకరణ యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలన్నారు. మున్నేరు నది రిటైనింగ్ వాల్ నిర్మాణానికి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత కల్పించిందని, ఇందుకోసం పనులు, భూ సేకరణ సమాంతరంగా జరగాలన్నారు.
భూ భారతి దరఖాస్తులను వేగంగా పరిష్కరించేందుకు అవకాశం ఉన్న దరఖాస్తులకు ప్రాధాన్యత ఇచ్చి ముందుగా పరిశీలించాలన్నారు. సక్సేషన్ కేసులను ఫాలో అప్ చేసి వివాదాలు లేకపోతే పరిషరించాలన్నారు. విపత్తుల సమయంలో ముందుగానే సమాచారం అందేలా వ్యవస్థ ఏర్పాటు చేసుకున్నామన్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు పకా ప్రణాళిక ఉండాలని, రిలీఫ్ సెంటర్లను పకడ్బందీగా ఏర్పాటు చేయాలన్నారు. విపత్తుల సమయంలో ప్రాణ నష్టం జరగకుండా అందరూ సమష్టింగా పని చేయాలన్నారు. డీఆర్వో ఏ.పద్మశ్రీ, ఎస్డీసీ రాజేశ్వరి, ఆర్డీవోలు నర్సింహారావు, రాజేందర్ గౌడ్, తహసీల్దార్లు, కలెక్టరేట్ సూపరింటెండెంట్ పాల్గొన్నారు.