కోల్బెల్ట్లో కళాకారులకు కొదువ లేదు
సింగరేణి కోల్బెల్ట్ ప్రాంతంలో కళాకారులకు కొదువ లేదని మంచిర్యాల జడ్పీ చైర్పర్సన్ నల్లాల భాగ్యలక్ష్మి, మాజీ ఎమ్మె ల్యే నల్లాల ఓదెలు అన్నారు. తెలంగాణ రాష్ట్ర సంగీత అకాడమీ సౌజన్యంతో టాలెంట్ డ్యాన్స్ అకాడమీ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 1న నిర్వహిస్తున్న నృత్
- మంచిర్యాల జడ్పీ చైర్పర్సన్ భాగ్యలక్ష్మి, మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు
మందమర్రి జనవరి 30: సింగరేణి కోల్బెల్ట్ ప్రాంతంలో కళాకారులకు కొదువ లేదని మంచిర్యాల జడ్పీ చైర్పర్సన్ నల్లాల భాగ్యలక్ష్మి, మాజీ ఎమ్మె ల్యే నల్లాల ఓదెలు అన్నారు. తెలంగాణ రాష్ట్ర సంగీత అకాడమీ సౌజన్యంతో టాలెంట్ డ్యాన్స్ అకాడమీ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 1న నిర్వహిస్తున్న నృత్య కళామహోత్సవం-2023 పోస్టర్లు, కర పత్రాలను సోమవారం వారి నివాసం లో విడుదల చేశారు. మందమర్రి పట్టణంలోని సీఈఆర్ క్లబ్లో సాంస్కృతిక సమాఖ్య మంచిర్యాల జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నా రు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలను అన్ని రంగాల్లో చైతన్య పరిచేందుకు కళాకారులు కృషి చేయాలని కోరారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కళాకారుల సేవలు మరువలేనివన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కళాకారులను ప్రోత్సహిస్తున్నదని పేర్కొన్నారు. మందమర్రి పట్టణానికి చెందిన కళాకారులు రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించాలని ఆకాంక్షించారు. కళా మహోత్సవంలో నృత్య, సంగీత కళాకారులకు పురస్కారాలు అందజే స్తామని నిర్వాహకులు సునార్కర్ రాంబాబు తెలిపారు. ప్రోగ్రాం ఇన్చార్జి మాయ రమేశ్, సభ్యులు శేఖర్, శిరీశ్, చంద్రకాంత్, వెంకటేశ్, యోగి తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | స్వదేశీ మొబిలిటీ ప్లాట్ఫామ్ ‘రుటూర్’ ప్రారంభం.. డ్రైవర్లకు కమీషన్ లేని సేవలే లక్ష్యం!
JCJ Results | మూడు రోజుల వ్యవధిలోనే రెండు కొలువులు.. జూనియర్ సివిల్ జడ్జిగా పెద్దపల్లి యువతి హారిక..!
హస్తినలో పరిమళించిన తెలంగాణ పూల పండుగ.. తెలంగాణ భవన్లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
Destiny | నందినీ రెడ్డి చేతుల మీదుగా ‘డెస్టినీ’ ఫస్ట్ లుక్ లాంచ్.. ఇంట్రెస్టింగ్గా ఇమ్మాన్యుయేల్ లుక్!
శ్రీ రామలింగేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ను సత్వరమే పూర్తి చేయాలి : మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

