భద్రాద్రి కొత్తగూడెం, జనవరి 9 (నమస్తే తెలంగాణ): సీఎం కేసీఆర్ కొత్తగూడెం పర్యటనను జయప్రదం విజయవంతం చేయాలని ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కొత్తగూడెం క్లబ్లో సోమవారం ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. భద్రాద్రి నూతన కలెక్టరేట్‌ను ఈ నెల 12న సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారని అన్నారు.
ఈ సందర్భంగా బహిరంగ సభ నిర్వహించనున్నట్లు చెప్పారు. ఈ సభకు కొత్తగూడెం నియోజకవర్గం నుంచి కార్యకర్తలు భారీగా తరలిరావాలని కోరారు. జడ్పీ వైస్ చైర్మన్ కంచర్ల చంద్రశేఖరరావు, మున్సిపల్ చైర్పర్సన్ కాపు సీతాలక్ష్మి, డీసీఎంఎస్ వైస్ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు, ఏఎంసీ చైర్మన్ భూక్యా రాంబాబు, ఆత్మ కమిటీ చైర్మన్ బత్తుల వీరయ్య, ఉర్దూఘర్ చైర్మన్ అన్వర్‌పాషా, మున్సిపల్ వైస్ చైర్మన్ దామోదర్, ఎంఏ రజాక్, జడ్పీటీసీ బరపటి వాసుదేవరావు, కాసుల వెంకట్, కొట్టి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.