ఖమ్మం, అక్టోబర్ 2 : రాష్ట్రంలో అర్హులైన ప్రతి పేదవాడి సొంతింటి కలను ముఖ్యమంత్రి కేసీఆర్ నిజం చేశారని, జీవో 58, 59 కింద ఇండ్ల పట్టాలు, గృహలక్ష్మి పథకం కింద రూ.3 లక్షల సాయం అందజేస్తున్నట్లు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ తెలిపారు. సోమవారం ఖమ్మం నగరంలోని భక్తరామదాసు కళాక్షేత్రంలో లబ్ధిదారులకు జీవో 58, 59 కింద 91మందికి, గృహలక్ష్మి పథకం కింద 119 మందికి మంజూరు పత్రాలను అందజేశారు.
ఈ సందర్భంగా మంత్రి అజయ్ మాట్లాడుతూ పేదలకు ఇండ్ల పట్టాల పంపిణీతోపాటు ఇంటిస్థలం ఉన్నవారికి గృహలక్ష్మి పథకం కింద ఇల్లు నిర్మించుకునే బృహత్తర కార్యక్రమానికి సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టారన్నారు. ప్రభుత్వ స్థలాల్లో నివాసముంటున్న పేదలకు వారి ఆధీనంలో ఉన్న ఇంటి స్థలాన్ని వారికే పూర్తి హకులు కల్పించినట్లు తెలిపారు. 2014 నుంచి 2020 వరకు ఉంటున్న వారి నివాస ధ్రువపత్రాల ఆధారంగా మీ సేవ ద్వారా దరఖాస్తు సమర్పించిన అర్హులందరికీ క్షేత్ర పరిశీలన చేసి పారదర్శకంగా మొదటివిడతగా 3,253 మందికి పట్టాలు అందించినట్లు తెలిపారు. ఇప్పటికే 2వేల మందికి డబుల్ బెడ్రూం ఇండ్లు ఇచ్చినట్లు పేర్కొన్నారు. వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, మూడోసారీ సీఎం కేసీఆరేనని ధీమా వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో తనను ఆశీర్వదించి గెలిపించాలని కోరారు.
ఖమ్మంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
రఘునాథపాలెం, అక్టోబర్ 2 : బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతే ధ్యేయంగా బీఆర్ఎస్ ప్రభుత్వం పాలన సాగిస్తోందని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ పేర్కొన్నారు. సోమవారం ఖమ్మంలో విస్తృతంగా పర్యటించిన మంత్రి అల్లిపురం, పుట్టకోట ప్రాంతాల్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అల్లిపురంలో రూ.2 కోట్ల వ్యయంతో నిర్మించిన అధునాతన వైకుంఠధామం, రూ.1.50 కోట్లతో నూ తనంగా నిర్మించిన 33/11కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్, రూ.1.70 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్లను ముఖ్యఅతిథిగా పాల్గొని కలెక్టర్ వీపీ గౌతమ్‌తో కలిసి ప్రారంభించా రు. ఈ సందర్భంగా అల్లిపురంలో ఏర్పా టు చేసిన సభను ఉద్దేశించి మంత్రి మాట్లాడారు. రాష్ట్రంలోని నిరుపేదల ఆత్మగౌరవంతో బతకాలి అన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రథమ సంకల్పమన్నారు. అందుకు అనుగుణంగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చేపడుతున్నారన్నారు. నగరంలోని ప్రతి డివిజన్‌కు దాదాపు రూ.13 కోట్ల పైచిలుకు నిధులు కేటాయించి సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు.
అభివృద్ధి నిరంతరాయంగా కొనసాగాలంటే మరోమారు బీఆర్ఎస్కు పట్టం కట్టాలన్నారు. కార్యక్రమాల్లో మేయర్ పునుకొల్లు నీరజ, కలెక్టర్ వీపీ గౌతమ్, డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, సుడా చైర్మన్ బచ్చు విజయ్‌కుమార్, కార్పొరేటర్లు పల్లా రోజ్లీనా, మందడపు లక్ష్మి, రుద్రగాని శ్రీదేవి, పాకాలపాటి విజయనిర్మల, మక్బుల్, డోన్వన్ సరస్వతి, మేడారపు వెంకటేశ్వర్లు, దండా జ్యోతిరెడ్డి, రావూరి కరుణ, కూరాకుల వలరాజు, పగడాల శ్రీవిద్య, గజ్జెల లక్ష్మీవెంకన్న, మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ మల్లీశ్వరి, ఖమ్మం అర్బన్ తహసీల్దార్ స్వామి, స్థానిక ప్రజాప్రతినిధులు, విద్యు త్ ఏఈ సురేంద్ర, ఎప్‌ఎస్‌సీఎస్ చైర్మన్ బీరెడ్డి నాగచంద్రారెడ్డి. బీఆర్ఎస్ నాయకులు రావూరి సైదుబాబు, సంక్రాంతి నాగేశ్వరరావు, దనాల శ్రీకాంత్, మొర్రిమేకల కోటయ్య, ముప్పారపు ఉపేందర్‌రావు, సత్తి గోపాలరావు, బొమ్మా రాజేశ్వరావు, యర్రా అప్పారావు పాల్గొన్నారు.