మూడో రోజూ మాఫీ సంబురం
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా రుణమాఫీ సంబురాలు మూడో రోజూ కొనసాగాయి. శుక్రవారం సీఎం కేసీఆర్ ఫ్లెక్సీలు, చిత్రపటాలకు రైతులు, బీఆర్ఎస్ నాయకులు క్షీరాభిషేకం చేసి కృతజ్ఞతను చాటుకున్నారు. రైతు పక్షపాతి కేసీఆర్.. జైజై కేసీఆర్ అంటూ నినాదాలు చేశారు.
- ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సీఎం కేసీఆర్ ఫ్లెక్సీలకు క్షీరాభిషేకం
- ‘జై జై కేసీఆర్’ అంటూ రైతుల నినాదాలు
- రైతు పక్షపాతి సీఎం అని కొనియాడిన రైతులు
‘అప్పున్నదని రైతు టెన్షన్ పడొద్దు.. పంట పెట్టుబడికి బయట రుణం తేవొద్దు.. కరెంటు లేదని దిగులు చెందొద్దు.. సాగునీరు లేదని బాధపడొద్దు.. విత్తనాలు, ఎరువులు అందలేదని అధైర్యపడొద్దు.. రంది లేకుండా సాగును పండుగలా చేసుకోవాలి’ అనేది సీఎం కేసీఆర్ కల. ఆ కలను నెరవేర్చుతూ.. రైతులకు ఇచ్చిన మాట ప్రకారం అన్ని హామీలనూ నెరవేరుస్తున్నారు. తాజాగా రూ.లక్ష వరకు రుణమాఫీ చేస్తానని ప్రకటించారు. ప్రకటనపై రైతులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. ఊరూరా సంబురాలు నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా మూడోరోజు శుక్రవారమూ ఉమ్మడి జిల్లావ్యాప్తంగా కేసీఆర్ ఫ్లెక్సీలకు క్షీరాభిషేకం చేశారు. సీఎం కేసీఆర్‌కు జేజేలు పలికి తమ అభిమానాన్ని చాటుకున్నారు.
-నమస్తే నెట్వర్క్
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా రుణమాఫీ సంబురాలు మూడో రోజూ కొనసాగాయి. శుక్రవారం సీఎం కేసీఆర్ ఫ్లెక్సీలు, చిత్రపటాలకు రైతులు, బీఆర్ఎస్ నాయకులు క్షీరాభిషేకం చేసి కృతజ్ఞతను చాటుకున్నారు. రైతు పక్షపాతి కేసీఆర్.. జైజై కేసీఆర్ అంటూ నినాదాలు చేశారు. అడగకున్నా తమకు సాగుపరంగా అన్నీ సమకూరుస్తూ భరోసా కల్పిస్తున్న సీఎం కేసీఆర్‌ను ఎప్పటికీ మరచిపోమని, జీవితాంతం గుర్తుంచుకుంటామని, తాము బీఆర్ఎస్ పక్షానే నిలుస్తామని పేర్కొన్నారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Saudi Arabia | రియాద్ విమానాశ్రయం దాడిలో 12మంది మృతి.. మూడొందల మందికి గాయాలు..!
IND vs WI | బౌలర్లకు మరో సవాల్.. పొట్టి సిరీస్‌లో నేడు కీలక మ్యాచ్..!
Dharman | రజనీకాంత్ ‘ధర్మన్’పై భారీ అంచనాలు.. 2027 సంక్రాంతి నుంచి వేసవికి వాయిదా?
CJP Protest | 7వేల మంది అరెస్ట్.. నిరసనపై కేంద్రం నిర్బంధకాండ.. సీజేపీ ఆందోళనలపై ఉక్కుపాదం
Power Cuts | కాంగ్రెస్ మీటింగ్‌కు కరెంట్ షాక్.. మంత్రి పొంగులేటి మాట్లాడుతుండగా పవర్ కట్
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

