అందుకే టీఆర్ఎస్ ప్రభుత్వంలో వ్యవసాయ రంగానికి పెద్దపీట
అభివృద్ధి పనుల శంకుస్థాపనలో జడ్పీ చైర్మన్ లింగాల కమల్‌రాజు
ఎర్రుపాలెం, జూన్ 16: తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి వ్యవసాయ రంగానికి పెద్దపీట వేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్.. అనునిత్యం రైతులకు అండగా ఉంటున్నారని జడ్పీ చైర్మన్ లింగాల కమల్‌రాజు పేర్కొన్నారు. మండలంలోని శఖునవీడు గ్రామంలో రూ.20 లక్షల జడ్పీ నిధులతో నిర్మించిన అండర్ గ్రౌండ్ పైపులైన్‌ను గురువారం ప్రారంభించారు. గ్రామంలో 70 ఏళ్లుగా రైతులు పడుతున్న ఇబ్బందులు తొలగించి పైప్లైపు నిర్మాణం చేపట్టడంతో కార్యక్రమానికి విచ్చేసిన జడ్పీ చైర్మన్‌కు ఏఎంసీ మాజీ చైర్మన్ చావా రామకృష్ణ ఆధ్వర్యంలో రైతులు మేళతాళాలు, పూలవర్షంతో ఘన స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా జడ్పీ చైర్మన్ మాట్లాడుతూ.. అభివృద్ధి పనుల విషయంలోనూ, కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ విషయంలోనూ స్థానిక ఎమ్మెల్యే భట్టివిక్రమార్క అలసత్వం ప్రదర్శిస్తూ అభివృద్ధి ఫలాలు ప్రజలకు అందకుండా చేస్తున్నారని ఆరోపించారు. అనంతరం అండర్‌గ్రౌండ్ పైప్‌లైన్ నిర్మాణానికి పొలం ఇచ్చిన దాత చావా వెంకటేశ్వరరావును అభినందించారు. అనంతరం ఐదుగురు లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు. అంగన్వాడీలో పిల్లలకు పౌష్టికాహారాన్ని తినిపించారు. ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు చిత్తారు నాగేశ్వరరావు, రంగిశెట్టి కోటేశ్వరరావు, చావా రామకృష్ణ, దేవరకొండ శిరీష, శీలం కవిత, తిరుమలాచారి, శ్రీనివాసరావు, భాస్కర్‌రెడ్డి, రామకోటేశ్వరరావు, సాంబశివరావు, బాలరాఘవరెడ్డి, చావా అరుణ, రామిశెట్టి సుజాత తదితరులు పాల్గొన్నారు.