ఇల్లెందు, నవంబర్ 20 : ఆర్టీసీ కార్మిక సంఘాలపై ఆంక్షలు ఎత్తివేయాలని, గుర్తింపు సంఘాల ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో ఇల్లెందు ఆర్టీసీ డిపో ఎదుట నాయకులు బుధవారం ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షురాలు ఈసం వెంకటమ్మ, సహాయ కార్యదర్శి అబ్దుల్ నబి మాట్లాడుతూ కార్మికుల విషయంలో ఆర్టీసీ యాజమాన్యం, ప్రభుత్వం ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నదని, మహిళా కార్మికులకు మినహాయింపు లేకుండా రాత్రివేళల్లో డ్యూటీలు వేస్తున్నారని ఆరోపించారు. ఇల్లెందు బస్టాండ్లో ప్రయాణికుల కోసం సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీఐటీయూ మండల కన్వీనర్ తాళ్లూరి కృష్ణ, నాయకులు కామ నాగరాజు, సత్యనారాయణ, కోఠి, లక్ష్మణ్, కోటేశ్వరరావు, ఎన్.శ్రీనివాస్, హుస్సేన్, సుల్తాన, మరియ, ఉమాదేవి పాల్గొన్నారు.