జూలూరుపాడు, డిసెంబర్ 17 : మూడో దశ స్థానిక సంస్థల ఎన్నికల బరిలో జూలూరుపాడు మండలంలోని ఓ గ్రామ పంచాయతీలో సర్పంచ్ అభ్యర్థులుగా బరిలో నిలిచిన వారి పేర్లు ప్రముఖ పార్టీల అధినాయకుల పేర్లుగా ఉండటంతో అంతటా చర్చనీయాంశంగా మారింది. ఓ అభ్యర్థి పేరు చంద్రబాబు కాగా మరొకరి పేరు జగన్నాథం అలియాస్ జగన్గా ఉండడంతో గ్రామస్తులతో పాటు మండల ప్రజల దృష్టి సైతం ఆ పంచాయతీ వైపే మరలింది. ఇద్దరు రాష్ట్ర నాయకుల పేర్లు పోలి ఉండడంతో అదే తరహాలో ఎన్నికల్లో హోరాహోరీగా తలపడ్డారు. ఎన్నికల ఫలితాల్లో జగన్పై చంద్రబాబు గెలుపొందడంతో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం గుండ్లరేవు గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికల్లో భూక్య చంద్రబాబు, బానోత్ జగన్నాథం అలియాస్ జగన్ ఒకే పార్టీ అభ్యర్థులుగా పోటీ పడ్డారు. బుధవారం జరిగిన పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో జగన్పై చంద్రబాబు విజయం సాధించడంతో జగన్పై చంద్రబాబు విజయమంటూ సోషల్ మీడియాలో వైరల్గా మారింది.

Julurupadu : జగన్పై చంద్రబాబు విజయం