కారేపల్లి, సెప్టెంబర్ 26 : ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ పరిధిలోని సింగరేణి (కారేపల్లి) మండలం విశ్వనాథపల్లి గ్రామంలో రజక సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం చాకలి ఐలమ్మ జయంతి వేడుకను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ సంఘం జిల్లా నాయకుడు రేగళ్ల మంగయ్య మాట్లాడుతూ.. సబ్బండ వర్గాల ఆత్మగౌరవానికి, మహిళా చైతన్యానికి చాకలి ఐలమ్మ ప్రతీక అన్నారు. భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం పోరాడి తెలంగాణ ప్రజల తెగువను, పోరాట స్ఫూర్తిని ప్రపంచానికి చాటిన వీర వనిత చాకలి ఐలమ్మ అని కొనియాడారు. చాకలి ఐలమ్మ తెలంగాణ ప్రజలందరికీ ఆదర్శమని, ఆమె ఆశయ సాధనకు ప్రతి ఒక్కరం కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రజక సంఘం జిల్లా నాయకులు రేగళ్ల మంగయ్య, కనతాల ఉపేందర్, దాసరి వెంకటేశ్వర్లు, బెల్లంకొండ సత్యం, బెల్లంకొండ వేలాద్రి, యాడారి వెంకన్న, బెల్లంకొండ రాములు పాల్గొన్నారు.