మధిర, ఆగస్టు 07 : మధిర సివిల్ కోర్టు భవన నిర్మాణానికి ఖమ్మం జిల్లా జడ్జి జి.రాజగోపాల్ గురువారం భూమి పూజ చేశారు. కోర్టు భవన నిర్మాణానికి ప్రభుత్వం రూ. 24 కోట్లు మంజూరు చేసింది. ఈ సందర్భంగా నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేసేలా జిల్లా జడ్జి సూచించారు. ఈ కార్యక్రమంలో మదిర సీనియర్ సివిల్ జడ్జి ప్రశాంతి, జూనియర్ సివిల్ జడ్జి దీప్తి, న్యాయవాదులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.