Bollywood In Canada | బాలీవుడ్ అగ్ర నటి మాధురీ దీక్షిత్ కెనడాలో నిర్వహించిన తన లైవ్ ఈవెంట్కు దాదాపు మూడు గంటలు ఆలస్యంగా రావడంతో అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. షో ప్రారంభ సమయం టికెట్లలో రాత్రి 7:30 గంటలుగా పేర్కొన్నప్పటికీ మాధురీ దీక్షిత్ రాత్రి పది గంటల తర్వాత షోకి రావడంతో అభిమానులు ఈవెంట్కు సంబంధించిన నిర్వహణ లోపాలను బయటకి తెలుపుతూ ఆన్లైన్లో తమ నిరసనను తెలియజేశారు.
ఒక నెటిజన్ ఈ షోకి సంబంధించి రాసుకోస్తూ.. ఇది ఒక చాలా చెత్త షో. ప్రకటనల్లో చెప్పినట్లుగా కాకుండా.. మాధురి ఆలస్యంగా రావడమే కాకుండా కేవలం కాసేపు మాట్లాడి.. ప్రతిపాటకి ఒకట్రెండు సార్లు మాత్రమే డ్యాన్స్ చేశారు. ఇది చాలా నిరాశను కలిగించిందంటూ నెటిజన్ తెలిపాడు. మరో నెటిజన్ తన నిరసనను తెలుపుతూ.. మాధురి రాక ఆలస్యం కావడంతో తనకు ఉన్న పని కారణంగా షో మొదలుకాకముందే వెళ్లిపోతున్నాను అంటూ తెలిపాడు. అయితే ఈ షోపై అసంతృప్తి చెందిన కొందరు అభిమానులు తాము కొనుగోలు చేసిన టికెట్ల డబ్బులు (Refund) వెనక్కి ఇవ్వాలని నినాదాలు చేశారని సమాచారం.