కాశీబుగ్గ : ఎర్ర బంగారం(Mirchi) ధర రోజు రోజుకి పెరుగుతుంది. వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో బుధవారం వండర్ హార్ట్ మిర్చి ఆల్ టైం రికార్డ్ ధర నమోదు చేసుకుంది. క్వింటాల్ 37 వేల 100 రూపాయలు పలుకడం విశేషం. గత 4 సంవత్సరాల నుంచి ఇంత పెద్ద మొత్తంలో ధరలు పలుకలేదని మార్కెట్ అధికారులు తెలిపారు.
కాగా, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని పలిమెల మండలం నీలంపల్లి గ్రామానికి చెందిన ఆర్ వినోద్ 80 వండర్ హాట్ మిర్చి మార్కెట్కు తీసుకొచ్చారు. కీర్తన అడితి ద్వారా దీనికి ధర రూ. 37,100గా నిర్ణయించారు.