బీబీనగర్, నవంబర్ 4: సమస్యలు తాత్కాలికం, కానీ జీవితం శాశ్వతమని ప్రజాసంఘాల నాయకుడు, టైగర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంజాల సురేష్ గౌడ్ (Suresh Goud) అన్నారు. బీబీనగర్ (Bibinagar) పట్టణ కేంద్రంలో ఉన్న పెద్ద చెరువులో ఇటీవల వరుసగా చోటుచేసుకుంటున్న ఆత్మహత్యలతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. ఈ ఘటనలపై స్పందించిన ఆయన చెరువు ఆవరణలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి, ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజల ప్రాణాలను రక్షించేందుకు చెరువు పరిసరాల్లో భద్రతా కంచెలు, సీసీ కెమెరాలు, పోలీసు పహారా ఏర్పాటు చేయాలని కోరారు.
ఆత్మహత్యలను నివారించేందుకు మానసిక ఆరోగ్యంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు.
పెద్ద చెరువు ప్రస్తుతం స్థానికులలో భయాన్ని రేకెత్తిస్తోందని అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలన్నారు. కాగా, ఈ ఫ్లెక్సీలు పట్టణ ప్రజల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. బీబీనగర్ పెద్ద చెరువు ఆవరణలోకి వచ్చేవారికి ఆత్మహత్యలపై హెచ్చరికలను చేస్తూ బాధ్యతలను గుర్తు చేస్తూ ఫ్లెక్సీలను ఏర్పాటు చేసినందుకు పలువురు అభినందిస్తున్నారు.