Gangai Amaran | ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా సోదరుడు, దర్శకుడు అయిన గంగై అమరన్ ఒక బహిరంగ కార్యక్రమంలో ఓ అభిమానితో అగౌరవంగా ప్రవర్తించడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది. ప్రముఖ గీత రచయిత వాలి వర్ధంతి సందర్భంగా జరిగిన స్మారక కార్యక్రమంలో ఈ సంఘటన చోటుచేసుకుంది.
గంగై అమరన్ మీడియాతో మాట్లాడుతుండగా.. వెనుక నిలబడిన ఒక అభిమానిని ఉద్దేశించి రా, నువ్వు మాట్లాడు అని సరదాగా పిలిచారు. అయితే ఆ అభిమాని మాట్లాడటానికి ముందుకు రాగానే గంగై అమరన్ వెంటనే పక్కకు జరిగి, ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు వెనకాల ఇలాగే నిలబడతారా? అంటూ కోపంగా మందలించారు. దీంతో ఆ అభిమాని అవమానానికి గురై నిశ్శబ్దంగా అక్కడి నుంచి వెనక్కి వెళ్లిపోయాడు. అయితే ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ఫుల్ వైరల్గా మారింది. దీనిపై నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. గంగై అమరన్కి అభిమానుల పట్ల ఇంత అహంకారం (Arrogance) సరికాదని.. ఆయన వెంటనే ఆ అభిమానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.
தலைக்கனம் ஏறிய கங்கை அமரன் 🤬 pic.twitter.com/xoQcnNfPl2
— priya (@PriyankaSmile01) November 2, 2025