ఖమ్మం డిసెంబర్ 29: రాష్ట్ర పరిధిలోని రైల్వే ప్రాజెక్టులపై కేంద్రం వివక్ష చూపుతున్నదని ఎంపీ నామా నాగేశ్వరరావు ఆరోపించారు. గురువారం ఆయన ఖమ్మంలోని రైల్వేస్టేషన్‌ను ఆకస్మికంగా సందర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో రైల్వేస్‌కు సంబంధించిన ప్రతిపాదనలు ఇప్పటికీ పెండింగ్‌లోనే ఉన్నాయన్నారు. సమస్యల పరిష్కారంపై కేంద్రం నుంచి ఎలాంటి మద్దతు లభించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే విషయాన్ని అనేకసార్లు తాను పార్లమెంట్లో ప్రస్తావించానని, అయినా కేంద్రం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం విచారకరమన్నారు. ఖాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని యావత్ ప్రజానీకం కోరుతున్నా కేంద్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నదని మండిపడ్డారు. ఖమ్మం రైల్వే స్టేషన్లో సీసీ కెమెరాలు, ఎస్కిలేటర్ ఏర్పాటు చేయాలని రెండేళ్ల క్రితం దక్షిణ మధ్య రైల్వే అధికారులను కోరినా ఇప్పటివరకు పట్టించుకున్న పాపానపోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంపీ వెంట ఖమ్మం నగరపాలక సంస్థ ఆదర్శ్ సురభి, రైతుబంధుసమితి జిల్లా కన్వీనర్ నల్లమల వెంకటేశ్వరరావు, సుడా డైరెక్టర్ ముక్తార్ తదితరులు ఉన్నారు.
ఖమ్మం రైల్వేస్టేషన్లో సౌకర్యాలు లేమిపై రైల్వేశాఖ అధికారులపై ఎంపీ నామా మండిపడ్డారు. నిర్మాణ దశలో ఉన్న ఎస్కిలేటర్ను పరిశీలించారు. పారిశుధ్య పనులను పర్యవేక్షించారు. మంచినీటి క్యాబిన్ మూసి ఉండడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం మురుగు నీటి వ్యవస్థను పరిశీలించి శాశ్వత ప్రతిపాదికన సమస్యను పరిష్కరించాలన్నారు. గ్రీనరీకి ప్రాధాన్యం ఇచ్చి రైల్వేస్టేషన్‌ను సుందరంగా తీర్చిదిద్దాలని సూచించారు. నేరాల నియంత్రణకు స్టేషన్ పరిధిలో తగినన్ని సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. స్టేషన్ బయట ఆటో కార్మికుల కోసం షెడ్డు నిర్మించాలని, మంచినీటి ట్యాప్ ఏర్పాటు చేయాలన్నారు. ఖమ్మం రైల్వేస్టేషన్‌ను మాడల్ స్టేషన్కుగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానన్నారు. అనంతరం నగరంలోని సారథినగర్ రైల్వే అండర్ బ్రిడ్జి ప్రతిపాదిత ప్రదేశాన్ని పరిశీలించారు.
అన్నపురెడ్డిపల్లి, డిసెంబర్ 29: మండలంలోని జానకీపురం, పెంట్లంలో ఇటీవల వివిధ కారణాలతో పలువురు మృతిచెందారు. ఆయా కుటుంబాలను గురువారం ఎంపీ నామా, ఎమ్మెల్యే మెచ్చా పరామర్శించారు. పెంట్లంలో మృతుడు శశిప్రణయ్ కుటుంబ సభ్యులు ఎంపీ నామాకు తమ సమస్యలను విన్నవించారు. తమకు సంబంధించిన ఎకరా భూమిని గ్రామంలో సబ్ స్టేషన్‌కు ఇచ్చామని, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇప్పించాలని ఎంపీని కోరారు. ఎంపీ వెంటనే స్పందించి విద్యుత్‌శాఖ ఉన్నతాధికా రులతో ఫోన్లో మాట్లాడారు. సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు. అనంతరం రాజాపురంలో పలు కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేశారు. పర్యటనలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బోయినపల్లి సుధాకర్‌రావు, ప్రధాన కార్యదర్శి పర్సా వెంకటేశ్వరరావు, ఎంపీపీ సున్నం లలిత, వైస్ ఎంపీపీ మామిళ్లపల్లి రామారావు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, నాయకులు ఉన్నారు.
చండ్రుగొండ, డిసెంబర్ 29: రైతు సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని ఎంపీ నామా నాగేశ్వరరావు అన్నారు. గురువారం ఆయన ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావుతో కలిసి మద్దుకూరు, చండ్రుగొండ, తిప్పనపల్లి, తుంగారం, రావికంపాడులో పర్యటించారు. 10 కుటుంబాలకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. మద్దుకూరు, తిప్పనపల్లిలో మృతులు తన్నీరు కిరణ్‌కు మార్, బిస్మిల్లా కుంటుబాలను పరామర్శించారు. పర్యటనలో ఉభయ జిల్లాల రైతుబంధు సమితి కన్వీనర్లు అంకిరెడ్డి కృష్ణారెడ్డి, నల్లమల వెంకటేశ్వరరావు, ఎంపీపీ పార్వతి, వైస్ ఎంపీపీ సత్యనారాయణ, జిల్లా పరిషత్ కో-ఆప్షన్ సభ్యుడు సయ్యద్ రసూల్, గానుగపాడు, గుంపెన సొసైటీల అధ్యక్షులు చెవుల చందర్రావు, వెంకట్రావు, బీఆర్ఎస్ మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు దారా బాబు, ఉప్పతల ఏడుకొండలు, నాయకులు బోజ్యానాయక్, మోహన్‌రావు, వెంకయ్య, రమేశ్, లింగయ్య, విజయలక్ష్మి, బీలు, నాగేశ్వరరావు, శ్రీనివాసరావు, రాఘవులు, నాగరాజు, చిన్నపిచ్చయ్య, రమేశ్ ఉన్నారు.
రావికంపాడు రైల్వే అండర్ బ్రిడ్జిలో నీరు నిల్వ ఉంటున్న కారణంగా ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు తెలుసుకున్నా నని, సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని ఎంపీ నామా నాగేశ్వరరావు అన్నారు. గురువారం ఆయన ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావుతో కలిసి బ్రిడ్జిని పరిశీలించారు. ఎంపీ, ఎమ్మెల్యే ములకలపల్లి మండలంలోనూ విస్తృతంగా పర్యటించారు. మృతుల కుటుంబాలను పరామర్శించారు. లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేశారు. పర్యటనలో పార్టీ మండల అధ్యక్షుడు మోరంపూడి అప్పారావు, కార్యదర్సి శనగపాటి అంజి ఉన్నారు.