చీమలవారిగూడెంలో సీసీ రోడ్ల పనులు ప్రారంభం
సింగరేణి మండలం రేగులగూడెం గ్రామ పంచాయతీ చీమలవారిగూడెంలో సోమవారం సీసీ రోడ్ల నిర్మాణ పనులను సర్పంచ్ ఈసం మోతీ వీరస్వామి, సంత ఆలయ కమిటీ మాజీ చైర్మన్ అడ్డగోడ ఐలయ్య ప్రారంభిచారు. రేగులగూడెం గ్రామ పంచాయతీ అభివృద్ధికి గాను..
కారేపల్లి, ఏప్రిల్ 04 : సింగరేణి మండలం రేగులగూడెం గ్రామ పంచాయతీ చీమలవారిగూడెంలో సోమవారం సీసీ రోడ్ల నిర్మాణ పనులను సర్పంచ్ ఈసం మోతీ వీరస్వామి, సంత ఆలయ కమిటీ మాజీ చైర్మన్ అడ్డగోడ ఐలయ్య ప్రారంభిచారు. రేగులగూడెం గ్రామ పంచాయతీ అభివృద్ధికి గాను వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్, ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి రూ.20 లక్షల నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. ఈ నిధులతో పనులు నిర్వహించడం జరుగుతుందన్నారు. పంచాయతీలోని శివారు గ్రామాలలోని వీధులను సీసీ రోడ్లుగా మార్చడం జరుగుతుందన్నారు. గేటుకారేపల్లి రైల్వే గేటు నుండి అనంతారం గ్రామం వరకు గల రహదారి కంకర తేలి గత కొన్ని ఎండ్లుగా 10 గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, దానిని బీటీగా మార్చడానికి ఎమ్మెల్యే రాందాస్ నాయక్ రూ.20 లక్షలు మంజూరు చేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు పెద్దబోయిన వెంకటనర్సయ్య, చీమల లక్ష్మి, చెవుల భద్రయ్య, ఆవుల శ్రీను పాల్గొన్నారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS AUSTRALIA | వెలుగు పత్రిక తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం : అనిల్ బైరెడ్డి
AP Muncipal Elections | ఈ నెల 28వ తేదీన ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు సెలవు!
Shakambari Devi | శాకాంబరీదేవిగా వేయిస్తంభాల రుద్రేశ్వరీదేవి దర్శనం
Harish Rao | రైతుకూలీల బిడ్డలు డాక్టర్లు కావడం గర్వకారణం : మాజీ మంత్రి హరీష్రావు
TGSRTC | పండుగ వేళ టికెట్ ఛార్జీల బాదుడు.. 2003 జీవో పేరుతో సమర్థించుకున్న టీజీఎస్ఆర్టీసీ!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

