ఖమ్మం అర్బన్/ వైరా టౌన్, మే 13: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) పదో తరగతి ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో ఖమ్మం జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. ఈ రిజల్ట్స్‌లో పలు ప్రైవేటు పాఠశాలలు రాణించాయి. అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను ఆయా పాఠశాలల యాజమాన్యాల బాధ్యులు అభినందించారు.
సీబీఎస్ఈ టెన్త్ ఫలితాల్లో తమ విద్యార్థులు సత్తా చాటారని ఖమ్మంలోని శ్రీచైతన్య పాఠశాల చైర్మన్ మల్లెంపాటి శ్రీధర్, డైరెక్టర్ శ్రీవిద్య తెలిపారు. తమ విద్యార్థుల్లో జస్వంత్-489, కవితాచౌదరి-485, యశస్విత-484, సూర్యతేజ-483, సంహితరెడ్డి-480 మార్కులతో రాణించినట్లు చెప్పారు. తమ విద్యార్థులు నూరు శాతం ఉత్తీర్ణత సాధించారని, 30 మంది విద్యార్థులు 450కిపైగా మార్కులు పొందారని వివరించారు. ప్రతిభ చూపిన విద్యార్థులను ఏజీఎం చేతన్మాధుర్, కృష్ణారావు, నాగప్రవీణ, శర్మ, సురేశ్ అభినందించారు.
సీబీఎస్ఈ టెన్త్, ఇంటర్ ఫలితాల్లో తమ విద్యార్థులు అద్భుత ఫలితాలు సాధించారని వైరా న్యూ లిటిల్ ఫ్లవర్స్ కరస్పాండెంట్ డాక్టర్ పీ.భూమేశ్రావు తెలిపారు. టెన్త్‌లో మొత్తం 172 మంది విద్యార్థులకుగాను అందరూ పాసై నూరు శాతం ఉత్తీర్ణత సాధించినట్లు చెప్పారు. తమ విద్యార్థుల్లో బండి రమ్యశ్రీ, ఏలూరి త్రియ 482 మార్కులతో 97 శాతం, డీ.సాత్విక చౌదరి 95 శాతం, మేడా చర్విత, మణికంఠ, మేఘన 94 శాతం మార్కులు సాధించినట్లు వివరించారు. ఇంకా 22 మంది విద్యార్థులు 90 శాతానికి పైగా ఉత్తీర్ణత సాధించినట్లు చెప్పారు. ఇంటర్ (12వ తరగతి) ఫలితాల్లో మొత్తం 48 మంది విద్యార్థులకుగాను అందరూ పాసై నూరు శాతం ఉత్తీర్ణత సాధించినట్లు తెలిపారు. బోజెడ్ల తేజశ్రీ అనే విద్యార్థి అత్యున్నతంగా 450 మార్కులతో 90 శాతం ఉత్తీర్ణత నమోదు చేసినట్లు చెప్పారు.
సీబీఎస్ఈ టెన్త్ ఫలితాల్లో తమ విద్యార్థులు విజయదుందుభి మోగించారని ఖమ్మంలోని హార్వెస్ట్ పాఠశాల కరస్పాండెంట్ పోపూరి రవిమారుత్ తెలిపారు. తమ విద్యార్థుల్లో రిషిత్-492, తేజస్వి-489, హిమవర్షిణి-487, ధన్విత-485, చందన, షాజియాఇరం-483, ధీరజ్-481, సహస్ర, భువన్-480 మార్కులతో రాణించినట్లు వివరించారు. తమ విద్యార్థులు నూరు శాతం ఉత్తీర్ణత సాధించారని, 76 మంది విద్యార్థులు 450కిపైగా మార్కులు పొందారని వెల్లడించారు. అలాగే, ఇంటర్లో రాఘవేంద్ర నవీన్-487, రేపల్లి శ్రీష-484, సాయిచరణ్, సిద్ధార్థ్-482 మార్కులు సాధించినట్లు వివరించారు. 18 మంది విద్యార్థులు 450కిపైగా మార్కులు సాధించారన్నారు. ప్రతిభ చూపిన విద్యార్థులను ప్రిన్సిపాల్ రామసహాయం పార్వతిరెడ్డి అభినందించారు.