ఖమ్మం ఎడ్యుకేషన్, ఫిబ్రవరి17 : ఖమ్మం జిల్లాలో ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలకు చెందిన 19 మంది ప్రధానోపాధ్యాయులకు జిల్లా విద్యాశాఖ అధికారి యాదయ్య గురువారం షోకాజ్ నోటీసులు జారీ చేశారు. విద్యార్థుల హాజరు 50 శాతం కంటే తక్కువగా ఉండడంతో కలెక్టర్ ఆదేశాల మేరకు చర్యలు తీసుకున్నట్లు డీఈవో తెలిపారు. దీనిపై మూడు రోజుల్లో వివరణ ఇవ్వాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.