మధిర, ఏప్రిల్ 7 : మధిర పట్టణంలోని అంబేద్కర్ సెంటర్లో ప్రయాణికుల కోసం బస్ షెల్టర్ ఏర్పాటు చేయాలని కోరుతూ స్థానిక వ్యాపారస్తులు మిరియాల కాశయ్య, కోమటిడి శ్రీనివాసరావు సోమవారం తాసీల్దార్ రాంబాబు, కమిషనర్ సంపత్ కుమార్కు వినతి పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… వేసవి ఎండల తీవ్రత ఎక్కువ అవుతున్నందున ప్రయాణికుల సౌకర్యార్థం బస్ షెల్టర్ ఏర్పాటు చేయాలని కోరారు.
అంబేద్కర్ సెంటర్ నుండి ప్రతిరోజు విజయవాడ, నందిగామ, ఎర్రుపాలెం, జమలాపురం, బనిగళ్లపాడు, దేశనేనిపాలెం, మహాదేవపురం, దెందుకూరు చిలుకూరు గ్రామాలకు వందలాది మంది ప్రయాణికులు రాకపోకలు కొనసాగిస్తారని తెలిపారు. ప్రయాణికులు వేచి ఉండేందుకు అంబేద్కర్ సెంటర్లో నిల్వ నీడలేక పోవడంతో ఎండలోనే పడిగాపులు కాస్తున్నట్లు చెప్పారు. రోజురోజుకి పెరుగుతున్న ఉష్ణోగ్రతలను దృష్టిలో పెట్టుకుని బస్సు షెల్టర్ ఏర్పాటు చేయాలని వారు కోరారు.