KTR | ఖమ్మం, జూలై 17 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ శుక్రవారం ఉమ్మడి ఖమ్మం జిల్లాకు రానున్నారు. హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో బయలుదేరి ఉదయం 11 గంటలకు ఖమ్మంలోని మమత మెడికల్ కళాశాలకు చేరుకుంటారు. అక్కడ కార్యకర్తలను కలిసిన తర్వాత 11.30 గంటలకు కవిరాజ్‌నగర్‌లోని మాజీ ఎమ్మెల్యే బానోత్ మదన్‌లాల్ గృహానికి చేరుకుని ఆయన కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు.
అక్కడి నుంచి బయలుదేరి 12 గంటలకు మమత మెడికల్ కళాశాలలోని హెలిపాడ్‌కు చేరుకుని కరకగూడెం బయలుదేరి వెళతారు. 12.40 గంటలకు కరకగూడెం మండలం సమత్భట్టుపల్లిలోని మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు గృహానికి చేరుకుంటారు. రేగా మాతృమూర్తి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పిస్తారు. రేగాను, కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు. మధ్యాహ్నం 1.30 గంటలకు కరకగూడెం నుంచి బయలుదేరి 2.30 గంటలకు హైదరాబాద్ చేరుకుంటారు. కేటీఆర్‌తోపాటు మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర తదితర నాయకులు రానున్నారు.
ఉమ్మడి ఖమ్మంలో శుక్రవారం జరుగనున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటనలో పాల్గొనేందుకు పార్టీ శ్రేణులన్నీ తరలిరావాలని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర కోరారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. మొదట ఖమ్మంలోని వైరా మాజీ ఎమ్మెల్యే బానోతు మదన్‌లాల్ నివాసానికి వెళ్లి ఆయన చిత్రపటానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శిస్తారని తెలిపారు. తరువాత కరకగూడెంలో బీఆర్ఎస్ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడైన రేగా కాంతారావును పరామర్శిస్తారని తెలిపారు.