కార్యకర్తలకు ఎల్లప్పుడూ.. అండగా ఉంటాం..
అధికారంలో లేమని అధైర్యపడొద్దు.. నేను ఎవరికీ భయపడను.. నన్ను మంచి మెజార్టీతో గెలిపించండి.. మీకు అన్నివిధాలా అండగా ఉంటా.. ఎంతటి కష్టాన్నైనా ఎదురొంటానని బీఆర్ఎస్ ఖమ్మం పార్లమెంటరీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు పార్టీ కార్యకర్తలకు భరోసా కల్పించారు.
- ఖమ్మంలో బీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశం
- ప్రజలకు వివరించి కాంగ్రెస్ మోసాన్ని ఎండగట్టండి
- రాష్ట్ర ప్రయోజనాల కోసం గొంతెత్తి పోరాడుతా
- బీఆర్ఎస్ ఖమ్మం ఎంపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు
- నామా గెలుపు చరిత్రలో నిలిచిపోతుంది : మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్
- మార్పును అందిపుచ్చుకోవాలి : బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తాతా మధు
ఖమ్మం, ఏప్రిల్ 19 : అధికారంలో లేమని అధైర్యపడొద్దు.. నేను ఎవరికీ భయపడను.. నన్ను మంచి మెజార్టీతో గెలిపించండి.. మీకు అన్నివిధాలా అండగా ఉంటా.. ఎంతటి కష్టాన్నైనా ఎదురొంటానని బీఆర్ఎస్ ఖమ్మం పార్లమెంటరీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు పార్టీ కార్యకర్తలకు భరోసా కల్పించారు. ఖమ్మం నగరంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో శుక్రవారం ఆ పార్టీ పట్టణ అధ్యక్షుడు పగడాల నాగరాజు అధ్యక్షతన జరిగిన పార్టీ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశంలో నామా మాట్లాడారు. మంచి మెజార్టీతో గెలిపించి, పార్లమెంట్‌కు పంపిస్తే తెలంగాణ ప్రయోజనాల కోసం జిల్లావాణిని గొంతెత్తి మరింత బలంగా వినిపిస్తానని అన్నారు. గతంలో మంచి మెజార్టీతో గెలిపించారని, ఏమిచ్చినా మీ రుణం తీర్చుకోలేనన్నారు. కార్యకర్తల కష్టం వల్లనే మాకీ పదవులు అన్నారు. ప్రతి ఓటరును ఇంటింటికి వెళ్లి కలిసి కేసీఆర్ పాలనలో జరిగిన అద్భుత ప్రగతిని వివరించి, ప్రజలతో మమేకం కావాలని పేరొన్నారు. కాంగ్రెస్ ప్రతి వాగ్దానం వెనుక మోసం దాగి ఉందని ప్రజలు గ్రహించారని, కసితో ఎన్నికల కోసం ఎదురు చూస్తున్నారన్నారు. ప్రజలకు వాస్తవాలు చెప్పి, అబద్ధపు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎండగట్టాలని పిలుపునిచ్చారు. ఎంపీగా పార్లమెంట్ సాక్షిగా తెలంగాణ ప్రయోజనాలు కోసం, ప్రాజెక్టులు, నిధులు, హకులు, రైతులు, బడుగు, బలహీనవర్గాల వారి కోసం మాట్లాడడం జరిగిందని చెప్పారు. అడ్డగోలుగా కృష్ణానది నీటి ఒప్పందాలు చేసుకోవడం వల్ల రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతిన్నాయని, నీటి సమస్యకు రాష్ట్ర ప్రభుత్వమే కారణమన్నారు. తెలంగాణా ప్రయోజనాలు కాపాడాలంటే బీఆర్ఎస్ ఎంపీలు గెలవాల్సిన అవసరం ఉందన్నారు.
నామా గెలుపు చరిత్రలో నిలిచిపోతుంది : మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్
నామా నాగేశ్వరరావును ఎంపీ అభ్యర్థిగా కేసీఆర్ నిర్ణయిచారని, ఆయన విజయం కోసం ప్రతిఒకరు కష్టపడి పని చేయాలని ఆయన గెలుపు చరిత్రలో నిలిచిపోతుందని మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇంతవరకు అభ్యర్థినే నిర్ణయించలేదన్నారు. జిల్లాకు చెందిన మంత్రులు గతంలో కుటుంబపాలన గురించి బీఆర్ఎస్పై ఆరోపణలు చేశారని, ఇప్పుడేమో వారి కుటుంబసభ్యులకు ఎంపీ సీటు కోసం పైరవీలు చేస్తున్నారన్నారు. కేసీఆర్ కుటుంబం మొత్తం తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారని, తెలంగాణ అభివృద్ధిలో పాటుపడిన చరిత్ర వారికి ఉందని, మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చే కుటుంబసభ్యుల పాత్ర తెలంగాణ ఉద్యమంలో గాని అభివృద్ధిలో గానీ ఏమిటి..? అని ప్రశ్నించారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఎనిమిది ఎంపీ స్థానాలు గెలిచే అవకాశం ఉందని, అందులో ఖమ్మం ఒకటన్నారు.
మార్పును అందిపుచ్చుకోవాలి : బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్
గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలు కాంగ్రెస్ అమలుచేయడం లేదని, ఆచరణ సాధ్యం కానీ హామీలు ఇచ్చిందన్నారు. జిల్లా ప్రజలు మళ్లీ కేసీఆర్ వైపు, నాయకుల వైపు చూస్తున్నారని, మార్పును అందిపుచ్చుకోవాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ పిలుపునిచ్చారు. మండల, డివిజన్లో ఉన్న నాయకులు మనం చేసిన అభివృద్ధిని గ్రామగ్రామాల్లో తెలియజేయాలన్నారు. కేసీఆర్ ఇచ్చిన సంక్షేమ పథకాలను ఈ ప్రభుత్వం ఎందుకు అమలుచేయడం లేదో ప్రశ్నించాలన్నారు.
పువ్వాడ అజయ్ పుట్టినరోజు వేడుకలు
మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ పుట్టినరోజు సందర్భంగా కార్యకర్తలు పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన భారీ కేక్‌ను పువ్వాడ అజయ్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఎంపీ నామా, ఎమ్మెల్సీ తాతా మధు శాలువా కప్పి సత్కరించి పువ్వాడకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. సమావేశంలో మేయర్ పునుకొల్లు నీరజ, డీసీసీబీ మాజీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, సుడా మాజీ చైర్మన్ బచ్చు విజయ్‌కుమార్, తాళ్లూరి జీవన్, వీరూనాయక్, మెంతుల శ్రీశైలం, బొమ్మెర రామ్మూర్తి, దోకుపర్తి సుబ్బారావు, మైనార్టీ నాయకులు తాజుద్దీన్, మక్బూల్, కర్నాటి కృష్ణ, వివిధ డివిజన్ల కార్పొరేటర్లు, నాయకులు, రఘునాధపాలెం మండల నాయకులు, పార్టీ అనుబంధ సంఘాల అధ్యక్ష, కార్యదర్శులు పాల్గొన్నారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

