బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర ఆతిథ్యం ఇచ్చారు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా హైదరాబాద్ తెలంగాణ భవన్లో కార్యక్రమాలు ముగిసిన అనంతరం.. రవిచంద్ర ఆహ్వానం మేరకు ఆదివారం మధ్యాహ్నం బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీలోని ఎంపీ వద్దిరాజు నివాసానికి కేటీఆర్ చేరుకున్నారు. ఈ సందర్భంగా కేటీఆర్, మాజీ ఉప ముఖ్యమంత్రి డాక్టర్ తాటికొండ రాజయ్య, మాజీ మంత్రులు గంగుల కమలాకర్, ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ కే.ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్‌రెడ్డి, నన్నపనేని నరేందర్, రసమయి బాలకిషన్, ప్రముఖులు గంగుల సుధాకర్, గాలి అనిల్‌కుమార్, చల్లా హరిశంకర్, వాసుదేవరెడ్డి తదితరులతో కలిసి ఎంపీ వద్దిరాజు భోజనం చేశారు. ఈ సందర్భంగా ఎంపీ రవిచంద్ర మనుమరాలు సహశ్రికను కేటీఆర్ ముద్దుచేశారు. కుటుంబ సభ్యులు, సన్నిహితులతో ఫొటోలు దిగారు. -ఖమ్మం, జూన్ 2: