ఖమ్మం, సెప్టెంబర్ 26: బీఆర్ఎస్కు చెందిన వెనుకబడిన కులాల ప్రముఖులైన 40 మంది ప్రజాప్రతినిధులు, నాయకులు గురువారం తమిళనాడులో పర్యటించారు. బీసీల సంక్షేమం, సమున్నతి కోసం తమిళనాడు అక్కడి ప్రభుత్వం చేపట్టిన చర్యలు, అమలుచేస్తున్న పథకాలు, కార్యక్రమాల గురించి అధ్యయనం చేస్తున్నారు.
ఈ బృందంతో బీఆర్ఎస్ పార్టీమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర, శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్ ముదిరాజ్, మాజీ చైర్మన్ స్వామిగౌడ్, మండలి బీఆర్ఎస్ పక్ష నాయకుడు సిరికొండ మధుసూధనాచారి, మాజీ మంత్రులు గంగుల కమలాకర్, జోగు రామన్న, శ్రీనివాస్‌గౌడ్ తదితర ప్రముఖులు ఉన్నారు. తమిళనాడులోని సంబంధిత అధికారులతో వీరు సమావేశమై చర్చించారు. అనంతరం, తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మకు బీఆర్ఎస్ నేతలు అక్కడే ఘనంగా నివాళులర్పించారు.