ఖమ్మం రూరల్, మే 25: రాష్ట్రంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా బీఆర్ఎస్ పాలన కొనసాగుతున్నదని బీఆర్ఎస్ లోక్‌సభా పక్షనేత, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు, ఎమ్మెల్యే కందాళ ఉపేందర్‌రెడ్డి అన్నారు. గురువారం రాత్రి మండలంలోని ఏదులాపురంలో బీఆర్ఎస్ నాయకులు ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహాన్ని వారు ఆవిష్కరించారు. అనంతరం రూ.12.15లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను బాధిత కుటుంబాలకు అందజేశారు. అదే విధంగా ఇటీవల మరణించిన బీఆర్ఎస్ కార్యకర్త సారిక లక్ష్మయ్య కుటుంబానికి పార్టీ నుంచి మంజూరైన రూ.2లక్షల విలువ గల చెక్‌ను అందజేశారు. అనంతరం జరిగిన సమావేశంలో వారు మాట్లాడారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత సమాజంలోని అన్ని వర్గాలకు సంక్షేమ ఫలాలు అందాయన్నారు. రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు నల్లమల వెంకటేశ్వరరావు, ఎంపీపీ బెల్లం ఉమా, జడ్పీటీసీ యండపల్లి వరప్రసాద్, సుడా డైరెక్టర్ గూడ సంజీవరెడ్డి, నాయకులు, మైబెల్లి సాహెబ్, నారపాటి రమేశ్, గరుడ రమేశ్, ముఖ్య నాయకులు రెంటాల ఆనంద్, పేరం వెంకటేశ్వర్లు, ముత్యం కృష్ణారావు, అక్కినపల్లి వెంకన్న, ఆంజనేయులు, వెంపటి రవి, అంబేద్కర్ యువజనసంఘం నాయకులు పాల్గొన్నారు.
ఖమ్మం రూరల్, మే 25: సొసైటీలను లాభాలబాటకు తీసుకురావాలని ఎంపీ నామా నాగేశ్వరరావు అన్నారు. గురువారం సాయంత్రం నాయుడుపేటలోని ఏదులాపురం సొసైటీ కార్యాలయంలో నూతన సొసైటీ చైర్మన్‌గా ఎన్నికైన జర్పుల లక్ష్మణ్‌నాయక్ బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి ఎంపీ నామా, ఎమ్మెల్యే కందాళ, డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం ముఖ్య అథితిగా హాజరయ్యారు. తొలుత నూతన చైర్మన్‌కు పుష్పగుచ్ఛాలు అందజేసి శాలువాలతో సత్కరించారు.
కూసుమంచి రూరల్, మే 25: సీఎం కేసీఆర్ రైతు పక్షపాతి అని ఎమ్మెల్యే కందాళ ఉపేందర్‌రెడ్డి అన్నారు. మండలంలోని జక్కేపల్లి సొసైటీలో సబ్సిడీపై జీలుగు విత్తనాల పంపిణీని గురువారం ఆయన ప్రారంభించారు. ఎంపీపీ బానోత్ శ్రీనివాస్, జక్కేపల్లి, కల్లూరిగూడెం సొసైటీ చైర్మన్లు నలబోలు చంద్రారెడ్డి, వెంకటేశ్వర్లు, సర్పంచ్ మాధవి, బీఆర్ఎస్ మండల మాజీ అధ్యక్షుడు పరుశురాం, వెంకటనారాయణ, ఏడీఏ విజయచంద్ర, ఏవో రామడుగు వాణి పాల్గొన్నారు.
కూసుమంచి, మే 25: పేదలకు సీఎం సహాయ నిధి భరోసా ఇస్తున్నదని ఎమ్మెల్యే కందాళ ఉపేందర్‌రెడ్డి అన్నారు. కూసుమంచిలోని క్యాంపు కార్యాలయంలో గురువారం కూసుమంచి, తిరుమలాయపాలెం మండలాలకు చెందిన లబ్ధిదారులకు ఆయన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు. కూసుమంచి మండలానికి చెందిన 50 చెక్కులు రూ.16.65 లక్షలు, తిరుమలాయపాలెం మండలానికి చెందిన 27 చెక్కులు రూ.11.60 లక్షల విలువ గల చెక్కులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో డీసీసీబీ డైరెక్టర్ ఇంటూరి శేఖర్, మండల అధ్యక్షుడు వేముల వీరయ్య, కార్యదర్శి ఆసీఫ్, మండల మాజీ అధ్యక్షుడు చాట్ల పరశురాం, తిరుమలాయాపాలెం మండల నాయకులు పాల్గొన్నారు.
నేలకొండపల్లి, మే 25: మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు మంజూరైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే కందాళ ఉపేందర్‌రెడ్డి గురువారం పంపిణీ చేశారు. నేలకొండపల్లిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో 31 మందికి రూ.10.43 లక్షలను చెక్కుల రూపంలో పంపిణీ చేశారు. జడ్పీ వైస్‌చైర్మన్ మరికంటి ధనలక్ష్మి, ఎంపీపీ వజ్జా రమ్య, ఎంపీటీసీ శీలం వెంకటలక్ష్మి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఉన్నం బ్రహ్మయ్య, కార్యదర్శి వెన్నబోయిన శ్రీను, సర్పంచుల సంఘం అధ్యక్షుడు గండు సతీశ్, కోటి సైదారెడ్డి, ఎండీ వాజిద్, వంగవేటి నాగేశ్వరరావు, కొండా కనకప్రసాదు, గొలుసు రవి, మాదాసు ఆదాం, నాయకులు పాల్గొన్నారు.
నేలకొండపల్లి, మే 25: మండలంలోని చెన్నారం గ్రామంలో నూతనంగా నిర్మించిన సీతారామచంద్ర స్వామి ఆలయంలో గురువారం ధ్వజస్తంభం, ముత్యాలమ్మ ప్రతిష్ఠాపన కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. ఎంపీ నామా నాగేశ్వరరావు, ఎమ్మెల్యే కందాళ ఉపేందర్‌రెడ్డి, కోదాడ మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్రావు ముఖ్య అతిథులుగా పాల్గొని ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఎంపీ నామా నాగేశ్వరరావు రూ.2,01116, ఎమ్మెల్యే కందాళ ఉపేందర్‌రెడ్డి రూ.6 లక్షలను ఆలయ అభివృద్ధి కోసం అందించారు. ఈ సందర్భంగా యాగశాలలో నిర్వహించిన ప్రత్యేక పూజల్లో వారు పాల్గొన్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ పూజల్లో మధుకాన్ ఎండీ నామా కృష్ణయ్య, నాయకులు పాల్గొన్నారు.