ప్రజా సమస్యలపై గొంగెత్తితే ఆ గొంతును నొక్కే ప్రయత్నం చేస్తున్నది కాంగ్రెస్ సర్కారు. బడ్జెట్ సమావేశాల్లో ప్రజల తరఫున మాట్లాడేందుకు సిద్ధమైన మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డిపై అకారణంగా సస్పెన్షన్ వేటు వేసింది.
ప్రభుత్వాన్ని నడిపే దమ్ము, ధైర్యం కాంగ్రెస్‌కు లేకనే.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నేతలను టార్గెట్ చేస్తూ దుర్మార్గంగా ప్రవర్తించడంపై బీఆర్ఎస్ శ్రేణులు భగ్గుమన్నారు. వెంటనే జగదీశ్‌రెడ్డిపై సస్పెన్షన్ ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ధర్నాలు, నిరసనలు, దిష్టిబొమ్మ దహనం కార్యక్రమాలు చేపట్టారు.