కారేపల్లి, జూలై 24: ఖమ్మం జిల్లా కారేపల్లిలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. సింగరేణి మండల బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కారేపల్లి బస్టాండ్ సెంటర్లోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద కేక్ కట్ చేసి స్వీట్లు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీలు వాంకుడోత్ జగన్, ఉన్నం వీరేందర్, రైతుబంధు మాజీ కన్వీనర్ హన్మకొండ రమేష్, ఉద్యమకారులు, మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, వార్డు సభ్యులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, కేటీఆర్ అభిమానులు తదితరులు పాల్గొన్నారు.