ఎర్రుపాలెం: ఖమ్మం జిల్లా (Khammam) ఎర్రుపాలెంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. పార్టీ నేత యన్నం శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కేక్ కట్ చేసి మిఠాయిలు పంచిపెట్టారు. కేసీఆర్ నిండు నూరేండ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. అనంతరం బనిగండ్లపాడు గ్రామంలో తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేశారు. మాజీ జడ్పీటీసీ శీలం కవిత, నాయకులు, శేగిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి, షేక్ మస్తాన్ వలి, సంక్రాంతి కృష్ణారావు, శ్రీపాలశెట్టి తిరుపతిరావు, బొర్రా నరసింహారావు, జనార్ధన్ రెడ్డి, కృష్ణారెడ్డి, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
చండ్రుగొండలో..
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు జన్మదిన వేడుకలను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండలో (Chandrugonda) బీఆర్ఎస్ నేతలు ఘనంగా నిర్వహించారు. మొక్కలు నాటి, కేక్ కట్ చేసి సంబురాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర సాధకుడు కేసీఆర్ను ముచ్చటగా మూడోసారి ముఖ్యమంత్రిగా చూడాలని రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి సoగొండి రాఘవులు, గుంపెన సొసైటీ వైస్ చైర్మన్ నల్లమోతు వెంకటనారాయణ, సీనియర్ నాయకులు సూరా వెంకటేశ్వరరావు, గాద లింగయ్య, భూపతి రమేష్, మేడ మోహన్రావు, గుగులోతు రమేష్, కళ్లెం వెంకటేశ్వర్లు, భూపతి శ్రీనివాసరావు, సయ్యద్ గఫార్మెయా, కేలో శ్రీను, నరుకుల్ల వాసు, శ్రావణ్, పసుపులేటి క్రాంతి కుమార్, అంచ శ్రీను, వంకాయలపాటి బాబురావు, సయ్యద్ బాద్షా, సయ్యద్ యాకుబ్ అలీ, నరకుల అప్పాజీ, రామ్ శెట్టి సాయి, ప్రవీణ్, పూసం వెంకటేశ్వర్లు, పాండ్ల అంజన్ రావు,తదితరులు పాల్గొన్నారు.