దుమ్ముగూడెం, ఆగస్టు 21 : ఆంక్షలు లేకుండా రైతుల రుణాలన్నీ మాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలం లక్ష్మీపురం ఏబీజీవీబీ ఎదుట ప్రధాన రహదారిపై బీఆర్ఎస్ నాయకులు రైతులతో కలిసి బుధవారం ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. తొలుత గ్రామంలో ర్యాలీ నిర్వహించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
అనంతరం రోడ్డుపై బైఠాయించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు అన్నె సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ మండలంలోని అన్ని బ్యాంకుల్లో రుణమాఫీ కోసం 5,843 మంది రైతులు అర్హులు కాగా.. వారిలో కేవలం 3,451 మంది మాత్రమే మాఫీ పొందారని.. మిగిలిన 2,391 మంది రైతులకు మాఫీ కాలేదని మండిపడ్డారు. ప్రజాభిప్రాయ సేకరణ పేరుతో రైతుబంధును బంద్ పెట్టారని, ఇటు రైతుబంధు రాక.. అటు రుణమాఫీ కాక రైతులు నానా అవస్థలు ఎదుర్కొంటున్నారన్నారు. ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ అమలు చేసేంతవరకు రైతుల పక్షాన బీఆర్ఎస్ పోరాడుతుందన్నారు.
కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల కార్యదర్శి కణితి రాముడు, అధికార ప్రతినిధి జానీపాషా, సోషల్ మీడియా అధ్యక్షుడు దామెర్ల శ్రీనివాసరావు, సీనియర్ నాయకుడు కొత్తూరు సీతారామారావు, నోముల రామిరెడ్డి, బొల్లి వెంకట్రావు, దన్ని అప్పారావు, పొడియం సుబ్బారావు, మడకం రామారావు, కుర్సం సోమయ్య, మోతుకూరి శ్రీకాంత్, కటిబోయిన వెంకటేశ్వర్లు, సీతారాం, నూపా సీతయ్య, జంజూరి జయసింహ, జెట్టి రామకృష్ణ, గోసంగి కిరణ్, జిలకర గంగరాజు, జంగిటి రాము, కల్లూరి కామేశ్వరరావు, బొల్లి శేఖర్ తదితరులు పాల్గొన్నారు.