బీఆర్ఎస్ అభ్యర్థుల ప్రచారం ఊరూరా జోరుగా సాగుతున్నది. రోడ్ షోలు, ర్యాలీలు, సమావేశాలు నిర్వహించేందుకు నియోజకవర్గంలోని గ్రామాలకు విచ్చేసిన అభ్యర్థులకు మేళతాళాలతో ప్రజలు, కోలాటాలతో మహిళలు నీరా‘జనం’ పలికారు. నుదుట తిలకం దిద్ది ఆశీర్వదిస్తున్నారు.
కారు గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థులు ఓటర్లను ఆప్యాయంగా పలకరిస్తూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ప్రభుత్వం పదేళ్లలో చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ఇంటింటికీ తిరిగి వివరిస్తూ.. మ్యానిఫెస్టోలోని అంశాలపై అవగాహన కల్పిస్తూ కారు గుర్తుకు ఓటు వేయాలని కోరుతున్నారు.